TT Ads

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమౌతోంది.  తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న ప్రతిష్టానం పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళుతుంది తెలంగాణ నలుమూలల పార్టీ పక్షాన ప్రచారం నిర్వహించేందుకు రూట్ మ్యాప్ తయారు చేశారు ఈనెల 18న అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు.. మొదటగా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని రాహుల్ ప్రియాంక గాంధీ సందర్శిస్తారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఈ కార్యక్రమం ఏర్పాటు పరిశీలించేందుకుఏఐసీసీ కార్యదర్శి సుశాంక్ మిశ్రా శుక్రవారం కొండగట్ట అంజన్న క్షేత్రాన్ని సందర్శించారు. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటనకు సంబంధించిన రూట్ ను పర్యవేక్షించారు. సుశాంక్ తో పాటు ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, ధర్మపురి, చొప్పదండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యంలు కూడా ఉన్నారు. ఈ నెల 18న కొండగట్టు అంజన్న క్షేత్రానికి రానున్న రాహుల్, ప్రియాంక గాంధీలు ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించి ప్రచారం ప్రారంభిస్తారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *