తాను జమ్మూకశ్మీర్‌లో జోడో యాత్ర చేస్తున్నప్పుడు తనకు ఓ భయానక అనుభవం ఎదురైందని రాహుల్‌గాంధీ తెలిపారు. ‘‘ఆ ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగే ముప్పు ఉందని, పాదయాత్ర చేయొద్దని భద్రతా సిబ్బంది చెప్పారు. కానీ, నేను మా పార్టీ వాళ్లతో మాట్లాడి యాత్రలో ముందుకెళ్లేందుకే నిశ్చయించుకున్నా. అలా నడుస్తున్నప్పుడు ఓ గుర్తుతెలియని వ్యక్తి దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలని చెప్పాడు. కాంగ్రెస్ నేతలు నిజంగానే జమ్మూకశ్మీర్‌కు వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అని అడిగాడు. ఆ తర్వాత కొంత సేపటికి ఆ వ్యక్తి.. కాస్త దూరంగా ఉన్న కొంతమందిని చూపిస్తూ ‘వాళ్లంతా ఉగ్రవాదులు’ అని చెప్పాడు. ఆ ముష్కరులు నన్ను చంపేసే వారే. కానీ అలా చేయలేదు’’ అంటూ వివరించారు. తాను ప్రజల పక్షాన కేంద్ర సర్కార్ ను నిలదీయడానికే వచ్చాననే విషయం అర్థం అవ్వడం వల్లనే వారు నాకు ఎలాంటి హాని చేయలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు