TT Ads

సృష్టిలో బంధాలు వేటికవే ప్రత్యేకం. అందునా అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇంకా ప్రత్యేకం. ఒకవైపు అన్న రాజకీయాల్లో భాగంగా విరామం లేకుండా భారత్‌ జోడో పాదయాత్ర చేపట్టి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మరోవైపు ఆ సోదరి పార్టీలో క్రియాశీలక వ్యవహారాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఈ ఇద్దరూ ఒకచోట చేరారు. అలిసి పోయిన అన్న రాహుల్‌ గాంధీతో సరదాగా సంభాషించింది సోదరి ప్రియాంక గాంధీ వాద్రా. ఉప్పోంగిన ఆప్యాయతతో సోదరి మెడ చుట్టూ చేతులేసి ప్రేమతో ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారాయన.

 

*తన జీవితంలో తన అన్న రాహుల్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అని ఆమె గతంలోనే ప్రకటించుకున్నారు. ఇక రాహుల్‌ సైతం సోదరి విషయంలో అన్నగా ఏనాడూ తన బాధ్యతలను విస్మరించబోనని ప్రకటించుకున్నారు. ఈ అన్నాచెల్లెల అనుబంధం చిన్నప్పటి నుంచి ధృడంగా ఉంటోంది. యూపీలో భారత్‌ జోడో యాత్ర సందర్భంగా ఒకే వేదికపై వీళ్లిద్దరూ కూర్చని సరదాగా ముచ్చటించుకున్నారు. అన్న ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంతో ప్రియాంక నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ ప్రత్యేక క్షణాలు కెమెరా కంటికి చిక్కాయి. వారిద్దరి ఆప్యాయత, అనురాగాన్ని తెలిపే ఈ సన్నివేశానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. ఎన్నికల నాటికి పార్టీని మళ్లీ ఉత్సాహ పరిచే లక్ష్యంతో కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర చేపట్టింది. ప్రస్తుతం యూపీలో కొనసాగుతున్న ఈ యాత్ర నెలాఖరులో జమ్మూ కశ్మీర్‌లో చివరి దశకు చేరుకోనుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *