TT Ads

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చారు. వర్షం కారణంగా ఆయన విమానం మధురై నుంచి విశాఖకు ఆలస్యంగా  చేరుకుంది.. విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకున్నారు. ఈస్ట్ కోస్ట్ నేవల్ బేస్‌లో ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు.అనంతరం విశాఖ పట్టణం లో నిర్వహించిన భారీ రోడ్‌షో లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. నగరం లోని మారుతీ జంక్షన్ వద్ద ప్రధాని మోడీ ప్రజలకు అభివాదం చేశారు. ప్రజల నుండి అభివాదం స్వీకరించారు. . మోడీ రోడ్ షో నిర్వహిస్తున్న సమయం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

 

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కూడా ప్రధానమంత్రి కార్యాలయం రోడ్ షోలో పాల్గొనే అవకాశం కల్పించింది ప్రధానమంత్రి తో కలిసి సోము వీర్రాజు రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని రోడ్ షోకు విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మోదీ మోదీ అంటూ విశాఖ ప్రజలు చప్పట్లు, పూలతో స్వాగతం పలికారు. వాతావరణం అనుకూలించకపోవడంతో గంటన్నర ఆలస్యంగా వచ్చారు. వచ్చినప్పటికి ప్రజలు ,బి.జె.పి.శ్రేణులు స్వాగతం పలికారు. . పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని బస చేసిన నోవాటెల్ హోటల్ కు వెళ్లి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలిసారు. ప్రధాని మోడీ,పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *