400 యూనిట్లు ఉపయోగించుకున్న కరెంట్ బిల్ జిరో..!!

0
4

కరెంటు బిల్లు భారాన్ని తగ్గించుకునేందుకు ఓ మహిళ రైతు ముందడుగు వేసింది. తన ఇంటికి సౌర విద్యుత్ పలకలను బిగించుకుని కరెంట్ బిల్లును పూర్తిగా తగ్గించుకుంది. దీంతో గ్రామస్తులంతా సౌర విద్యుత్ వైపు అడుగులు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కృష్ణ నగర్ గ్రామానికి చెందిన జ్యోతి, సుబ్బరావు దంపతులు. వ్యవసాయ కుటుంబం. ప్రతి నెల 2 వేల రూపాయల వరకు కరెంట్ బిల్లు వస్తుంది. దీంతో కరెంట్ బిల్లు తగ్గించుకోవాలనే ఆలోచన వచ్చింది. శ్రీనిధి ద్వారా రుణం ఇచ్చి 60 శాతం సబ్సిడీ ఇస్తున్నారని తెలుసుకున్నారు. స్త్రీనిధి అధికారులను కలిసి 3 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నారు. స్త్రీనిధి నుంచి 1లక్ష 25 వేలు, 60 వేల సబ్సిడి, మరో పది వేల రూపాయలు సొంత డబ్బులు వెచ్చించారు.

వారికి ప్రతి నెల రెండు వేల వరకు వచ్చే కరెంట్ బిల్లు ఈ రోజు జీరో కు పడిపోయింది. ప్రతి రోజు 12 నుంచి 18 యూనిట్ల విద్యుత్ తయారు అవుతుంది. దీంతో మిగులు విద్యుత్ ను ట్రాన్స్ కోకు అమ్మడం జరుగుతుందని జ్యోతి ఆనందంగా చెబుతోంది. ప్రతి నెల స్త్రీనిధి డబ్బులు 2800 ల చొప్పున 60 నెలలు చెల్లిస్తే సరిపోతుంది. 20 ఏళ్ల పాటు సౌరవిద్యుత్ అందుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here