Home Politics టిఆర్ఎస్ ఉచ్చులో చిక్కుకున్న పొన్నం ప్రభాకర్… హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంచాలని మాస్టర్ ప్లాన్…!

టిఆర్ఎస్ ఉచ్చులో చిక్కుకున్న పొన్నం ప్రభాకర్… హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంచాలని మాస్టర్ ప్లాన్…!

0
8

పొన్నంకు బిఆర్ఎస్  వల.. 

హుస్నాబాద్ లో పోటీ చేయాలంటూ ఒత్తిడి..

కాంగ్రెస్ ను చీల్చేందుకు కుట్ర..

హైదరాబాద్ (ఏఆర్ మీడియా):

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అతి సునాయాసంగా గెలిచే హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం .. అక్కడ ఆ పార్టీని గెలవనీయకుండా చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ కుట్రలకు తెర లేపింది . ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అతి సునాయాసంగా గెలిచే సీటు కావడం వల్ల , దాన్ని నియంత్రించేందుకు బిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఉసి గొలుపుతూ హుస్నాబాద్ నియోజకవర్గ నుంచి పోటీ చేయాల్సిందిగా అంతర్గత భేరసారాలకు దిగినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి హుస్నాబాద్ సీటు గెలవడం నల్లేరు మీద నడకే.. అందుకే, దీనిపై బిఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతూ కాంగ్రెస్ పార్టీని చీల్చి , వర్గాలుగా విభజించి పబ్బం గడుపుకునేందుకు వెంపర్లాడుతుంది.

. నాన్ లోకల్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ ను హుస్నాబాద్ లో పోటీ చేయాలని ఊసిగొల్పుతున్నట్లు సమాచారం ..ఇప్పటికే రెండు దఫాలుగా గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పై ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొని ఉండటం , పైగా , ప్రభుత్వ పాలన తీరుపై విసుగెత్తిపోవటం వల్ల టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పేటట్లు లేవు.. బిఆర్ఎస్ పార్టీ గెలుపు పై ఆశలు వదులుకున్న సమయంలో పొన్నం ప్రభాకర్ అంది వచ్చిన ఆయుధంగా తయారయ్యారు.. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ కు టికెట్ ఇచ్చినట్లయితే బి ఆర్ ఎస్ పార్టీ గెలుపు సాధ్యమవుతుందని, ఆ పార్టీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అంచనా వేస్తున్నారు.. ఇందులో భాగంగానే ఆయనను అంతర్గతంగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం ..

మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కే మద్దతు :

హుస్నాబాద్ నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే గా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ రెడ్డికి ప్రజల్లో గట్టిపట్టు ఉంది.. ఈసారి కచ్చితంగా ప్రవీణ్ రెడ్డి కి విజయ అవకాశాలు ఉన్నట్లు అనేక సర్వేలు వెల్లడించాయి.. ఇప్పటికే , ప్రవీణ్ రెడ్డి నియోజకవర్గంలోని అనేక మండలాల్లో పాదయాత్రలు చేసి ప్రజలకు చేరువ వుతున్నారు..

నియోజకవర్గంలో ప్రవీణ్ రెడ్డి సుపరిచిత నాయకుడు కావడం వల్ల ప్రతి గ్రామంలో ని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు … ఈ విషయాన్ని తట్టుకోలేని బిఆర్ఎస్ నేతలు ఎలాగైనా ప్రవీణ్ రెడ్డిని నియంత్రించేందుకు పొన్నం ప్రభాకర్ ను రంగంలోకి దింపినట్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం, స్థానిక అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుందని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరికలు చేస్తున్నారు… ఏదేమైనాప్పటికీ, కాంగ్రెస్ పార్టీని చీల్చి మరోసారి బిఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు కుట్రలు చేస్తుందని ప్రచారం సాగుతోంది ..

స్థానికులనే గెలిపిస్తాం :

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం లోకల్ నాయకులను గెలిపిస్తామని చెప్తున్నారు . అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రవీణ్ రెడ్డికి మంచి పేరు ఉంది.. పైగా, ముల్కనూర్ సహకార బ్యాంక్ ద్వారా స్థానిక రైతులకు రుణాలు ఇప్పించడం, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలందరికీ సహాయం చేసి, మంచి పేరు తెచ్చుకున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు.. ఇలాంటి సమయంలో పార్టీ అధిష్టానం వర్గం ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇస్తే సునాయాసంగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.. స్థానికులు కూడా లోకల్ నాయకులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here