టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనను పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారి పేరును డైరీలో నోట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎవర్ని వదిలపెట్టేది లేదు. ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి జగన్ అండ్ కో హడలిపోతుంది. అనపర్తిలో చంద్రబాబు ప్రసగించకుండా పోలీసులను ఉపయోగించి బహిరంగ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనపర్తి సభకు జిల్లా పోలీసుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నా అకారణంగా సభకు అనుమతులు లేవంటూ అడ్డుకోవడం అప్రజాస్వామికం. సంక్షేమ పథకాల పేరిట రూ.10లు పంచిపెట్టి రూ.100 కోట్టేస్తున్న జగన్ రెడ్డి అసలు మోసాన్ని ప్రజలు గుర్తించారు. ఏదోక పథకం పేరు చెప్పి ఉదయం బటన్ నొక్కి సాయంత్రం మద్యం విక్రయాల రూపంలో దోచుకుంటున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులు కట్టే పరిస్థితి లేదు. దోపిడీ చేయడం తప్ప జగన్ ఏపీ ప్రజలకు చేసిందేమీ లేదు. చెత్త పై పన్ను వేసిన ఘనత జగన్ కే దక్కుతుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. వైసీపీ పాలనలో జనం విసుగు చెందారు. కాబట్టే సైకో పాలన పోవాలి… సైకిల్ పాలన రావాలని కోరుకుంటున్నారు.