TT Ads

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన అధికార వైఎస్ఆర్సిపి పార్టీల మధ్య తలెత్తిన విభేదాలతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి . మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో కొంతమంది రైతులు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది.. పవన్ కళ్యాణ్ జనసేన బహిరంగ సభకు స్థలమిచ్చిన వారికి చెందిన ఆస్తులను వైఎస్ఆర్సిపి వర్గాల ధ్వంసం చేశాయి దాదాపు 52 ఇండ్ల ప్రహరీ గోడలను కూల్చి వేసినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాధితులను జనసేన, కార్యకర్తలను పరామర్శించి వారికి సంఘీభావం తెలిపేందుకు శనివారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటం వెళ్లారు. .

 

 

పవన్‌ పర్యటన దృష్ట్యా ఆ ప్రాంతంలో పర్యటించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. పవన్‌ వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కారు దిగి కొద్ది దూరం కాలినడకన వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక తన వాహనంలో ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. పవన్‌కల్యాణ్‌ను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇప్పటం చేరుకున్న జనసేనాని.. అక్కడ కూల్చివేసిన నివాసాలను పరిశీలించారు. పవన్‌ పర్యటన దృష్ట్యా ఇప్పటం గ్రామాన్ని పోలీసులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *