భద్రత వైఫల్యం పై పార్లమెంట్లో గందరగోళం…78 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్

0
4

పార్లమెంట్లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్య ఘటనపై ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. ఈ వైఫల్యంపై చర్చ జరపాలనీ, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసినందుకు ఉభయ సభల్లో 78 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంట్ చరిత్రలో ఇంత మందిని సస్పెండ్ చేయటం ఇదే తొలిసారి. ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకూ వీరిని సస్పెండ్ చేస్తున్నట్టు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. గత వారం 14 మందిని సస్పెండ్ చేయగా, సోమవారం 78 మందిపై వేటు వేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 92 మందిపై వేటు పడింది. ప్రతిపక్షాల ఆందోళనతో సోమవారం సభా కార్యకలాపాలు స్తంభించాయి. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని పేర్కొంటూ రాజ్యసభలో 45 మంది, లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా 33 మంది ప్రతిపక్ష ఎంపీలపై వేటువేశారు. కాగా, లోక్సభలో ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు ముగ్గురిని సస్పెండ్ చేశారు. లోక్సభలో ఎంపీలు కె జయకుమార్, విజరు వసంత్, అబ్దుల్ ఖలీక్ అనే ముగ్గురు స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారని, వారిని ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చేవరకు సస్పెండ్ చేశారు. రాజ్యసభలో 11 మంది ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెన్షన్కు గురయ్యారు. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రివిలేజెస్ కమిటీకి సూచించారు. ప్రివిలేజెస్ కమిటీకి నివేదించిన వారిలో జెబి మాథర్ హిషామ్, ఎల్.హనుమంతయ్య, నీరజ్ డాంగి, రాజమణి పటేల్, కుమార్ కేత్కర్, జి. సి. చంద్రశేఖర్, బినోరు విశ్వం, పి. సంతోష్ కుమార్, మొహమ్మద్ అబ్దుల్లా, జాన్ బ్రిట్టాస్, ఎ. ఎ. రహీమ్ లు ఉన్నారు.
లోక్సభ సోమవారం ప్రారంభం కాగానే పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై చర్చించాలని, ప్రధాని మోడీ ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుపట్టారు. అందుకు ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందో�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here