క్రిస్టియన్ సంఘాలకు వ్యతిరేకంగా పాలకొల్లులో హిందూ సంఘాల భారీ ర్యాలీ

0
3

ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల క్రితం పట్టణంలో హిందువులకు వ్యతిరేకంగా కొన్ని క్రైస్తవ సంస్థలు ర్యాలీ నిర్వహించడంతో వివాదం మొదలైంది. క్రైస్తవ సంస్థలపై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. హిందూ జాగరణ్ సమితి ఫిబ్రవరి 14వ తేదీ లోగా అరెస్ట్ లు చేయాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టింది పోలీస్ లు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం తో హిందు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ప్రభత్వ వైఖరికి నిరసనగా పాల కొల్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హిందూ జాగరణ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవ వర్గాలకు అండగా ఉంటూ హిందూ మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా క్రిస్టియన్ సంఘాలు వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హిందూ జాగరణ సమితి నాయకులు హెచ్చరించారు

,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here