26.7 C
Hyderabad
Tuesday, May 28, 2024

నెంబర్ వన్ రేటింగ్ కొట్లాటలో నాయకుల మధ్య కొట్లాట పెట్టిన NTV …!

Must read

తగాదాల ఎన్ టీవీ

బీఆర్ఎస్ వంత పాడే చర్చలేంటి..?

— బహిరంగ చర్చలకు అనుమతి ఎవరిచ్చారు..?
— జర్నలిజం అంటే మీ జేబు సొత్తా..?

— బహిరంగ చర్చలకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఉందా..?

– టిఆర్పి ల కోసం ఎంతకైనా తెగిస్తారా…?

– ఇదే నా..? నెంబర్ నెం. 1 అంటే…?
జరుగరాని అనర్ధం జరిగితే కారకులు ఎవరు..?

శిక్ష ఎవరికి వేయాలి…?

— సమన్వయ చర్చలు ఎవరి ప్రాపకం కోసం..?

— బహిరంగ చర్చ లను ఈసీ నిషేధించాలి..

— నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలి..

కొండం అశోక్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
ఫోన్ : 9603322489

ఏ ఆర్ మీడియా, ఏసియన్ మీడియా, హైదరాబాద్ :

రోజురోజుకు ఎలక్ట్రానిక్ మీడియా పోకడలు పెచ్చు మీరిపోతున్నాయి…” బ్రాండ్ నేమ్” కోసం టిఆర్పి రేటింగ్ ల కోసం, వింత పోకడలతో సభ్య సమాజం ఏవగించుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించడం సిగ్గుమాలిన చర్యగా ఉంది … టిఆర్పి రేటింగ్ లో నెంబర్ వన్ స్థానం అంటూ ఉదరగొడుతున్న ఎన్ టివి ఛానల్ తగాదాలకు నిలయంగా మారింది… తన స్వార్ధ ప్రయోజనం కోసం, తన బ్రాండ్ ను ప్రజల్లో పెట్టడం కోసం, వింత పోకడలతో జర్నలిజాన్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీకి కొమ్ముకాస్తుంది… ఇందులో భాగంగా ఈ ఎన్నికల సమయంలో “గెలుపు ఎవరిది” అనే టాగ్ లైన్ తో బహిరంగ చర్చలను పెట్టి పెద్ద దుమారమే రేపుతుంది… అయితే ఈ బహిరంగ చర్చలకు ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ ఉందా..? నేనే నెంబర్ -1 అని మీడియా ముసుగులో అజమాయిషి చెలయిస్తూ… ఈ బహిరంగ చర్చలను ఎందుకు పెట్టినట్లు…? ఎవరికోసం పెట్టినట్లు..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి… ప్రధానంగా ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులను ఒకే వేదికపై తీసుకొచ్చి, వ్యక్తిగత విమర్శలకు ఉసిగొలిపి ఎవరిని ఉద్ధరిద్దామని, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు..? అనే ప్రశ్నలు కోకొల్లులు … అధికార బీఆర్ఎస్ పార్టీకి వంతపడే విధంగా ఎన్టీవీ నిర్వహిస్తున్న “గెలుపు ఎవరిది” అనే ప్రోగ్రాం బహిరంగ చర్చ లు రసాభాసగా మారుతున్నాయి..

. ఇటీవల ఎల్బీనగర్ లో నిర్వహించిన బహిరంగ సభతో పాటు, తాజాగా కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన బహిరంగ చర్చలు రసాభాసగా మారాయి. రాజకీయ పార్టీల నాయకులు వేదికపైనే తన్నుకున్న దృశ్యాలు చూసాం. బహిరంగ చర్చలో తన్నులాటకు తెరవేసిన ఎన్టీవీ సమన్వయకర్తలు లోపభూయిష్టంగా కార్యక్రమాన్ని నిర్వహించారా..? లేక అధికార పార్టీకి వంత పాడే విధంగా ఈ చర్చలను కొనసాగిస్తున్నారా..? అంటే, అవుననే సమాధానం వస్తుంది.. రెండు చోట్ల నిర్వహించిన బహిరంగ చర్చలలో అధికార పార్టీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, వారిని హైప్ చేసే విధంగా చేయడం ప్రజలు గమనిస్తున్నారని ఇంగిత జ్ఞానం లేకపోవడం దురదృష్టకరం…

నాయకుల తన్నులాట:

తాజాగా కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన ఎన్ టీవీ బహిరంగ చర్చలో అధికార పార్టీ ఎమ్మెల్యే వివేకానంద, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేశారు… వందలాది మంది చూస్తుండగానే వేదికపై ఉన్న శ్రీశైలం గౌడ్ ను పరుష పదజాలం ఉపయోగిస్తూ, గొంతు నొక్కే ప్రయత్నం చేశారు.. వెంటనే సభ సమావేశానికి వచ్చిన ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున వేదిక పైకి వెళ్లి గందరగోళం సృష్టించారు… వెంటనే నిర్వాహకులు బహిరంగ చర్చను ముగించేసి జారుకున్నారు ..

అక్రమ బహిరంగ చర్చలు నిషేధించాలి:

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే తమ ప్రచార బహిరంగ సభలకు ఈసీ నుంచి అనుమతి తీసుకుంటారు… కానీ , ఇక్కడ మీడియా ముసుగులో ఎవరి అనుమతి తీసుకోకుండానే, ఇలాంటి బహిరంగ చర్చలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు … ఈ సభలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది …ఇలాంటి విచ్చలవిడి బహిరంగ సభలను నిషేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

గెలుపెవరిది “చర్చలకు అర్థం ఏంటి..?

ఎన్టీవీ నిర్వహిస్తున్న “గెలుపు ఎవరిది” అనే చర్చలకు అర్థం ఏంటి..? ఈ ట్యాగ్ లైన్ ద్వారా పెడుతున్న చర్చలు ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తోంది..? ఈ చర్చల ప్రధాన ఉద్దేశం ఏంటి.? మీరు పెట్టుకున్న టాగ్ లైన్ పై ఏమైనా చర్చలు చేస్తున్నారా..? అసలు ఈ చర్చల్లో “గెలుపు ఎవరిది” అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు..? ఈ హక్కు మీకు ఎవరిచ్చారు .? అసలు జర్నలిజం నీ జేబులో ఉన్న బ్రహ్మస్త్రమా.? ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎలా పడితే, అలా, ఉపయోగించి మీ స్వప్రయోజనాలను తీర్చుకుంటారా…? ఇదేమి జర్నలిజం.? ఇదేమి బహిరంగ సభలు.. అంటే, మీరు రాజకీయ పార్టీలను తెర వెనుక నుండి నడిపిస్తున్నారా..? ఏ మెసేజ్ ని ప్రజలకు అందిస్తున్నారు..? అనేది తేలాల్సిన అవసరం ఉన్నది. ఇకనైనా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలతో కూడిన, స్వార్థ ప్రయోజనం తో కూడిన బహిరంగ చర్చలకు స్వస్తి పలకాలి.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు..? సమస్యలు ఎలా ఉన్నాయి..? అనే దానిపైన విజువల్స్ తో సహా ప్రజా బహుళయంలో పెట్టాలి … అప్పుడే కదా, నిజమైన జర్నలిజానికి అర్థం … మరి మీరు చేస్తున్నది ఏంటి.? ఇలాంటి జర్నలిజం వల్ల మొత్తం సమాజం వివగించుకునే పరిస్థితి వస్తుంది.. దీనివల్ల ఎవరికి లాభం.. ? ఎవరికి నష్టం..? అనేదానిని స్పష్టం చేయాల్సిన అవసరం నిర్వాహకులపై ఉంది.

ఎమ్మెల్యే వివేకానంద పై కేసు :

ఎన్టీవీ నిర్వహించిన బహిరంగ చర్చలో భాగంగా ఎమ్మెల్యే వివేకానంద బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేసిన విషయంపై బిజెపి నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. అలాగే ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని బిజెపి నేతలు ప్రకటించారు… అలాగే ఈ దాడికి సంబంధించి సంపూర్ణమైన ఆడియో, వీడియో సిడిలను అందజేస్తామని నాయకులు తెలిపారు..

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article