Home Election News తెలంగాణలో ఏ పార్టీ కి మెజార్టీ రాదు …ఫలితాల తర్వాతే తమ పార్టీ దే...

తెలంగాణలో ఏ పార్టీ కి మెజార్టీ రాదు …ఫలితాల తర్వాతే తమ పార్టీ దే కీ రోల్….బీజేపీ నేత బి.ఎల్‌.సంతోష్‌..!

0
5

తెలంగాణలో హంగే.. ప్రభత్వం బి జె పి దే ..!

త్వరలో తెలంగాణకు జరుగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ కి స్పష్టమైన మెజార్టీ రాదని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ జోస్యం చెప్పారు . అయితే బి జె పి నేతృత్వం లో నే ప్రభత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పారు .బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తాజాగా బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. సీట్ల కేటాయింపు ఢిల్లీలో కాకుండా తెలంగాణలోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో హంగ్ ఏర్పడి బీజేపీ అధికారంలోకి వస్తుందని కాషాయ శ్రేణులకు బీఎల్ సంతోష్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత బీజేపీ, బీఆర్ఎస్‌లు కలుస్తాయా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే తీవ్ర పోటీ ఉండనుంది. ఎన్నికల తర్వాత హంగ్ ఏర్పడితే.. దేశంలో చిరకాల ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీలు కలిసే అవకాశమే లేదు కాబట్టి ఇక మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్, బీజేపీలు కలవడమే అవుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ చెప్పినట్లు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అనే వ్యాఖ్యలకు బలం చేకూరనుంది. 

ఏ పార్టీ తో అవగాహన కుదుర్చుకుంటారో ఆయన స్పష్టం చేయ లేదు . కొన్ని  స్థానాలు తక్కువ పడితే మధ్య ప్రదేశ్ ,కర్ణాటక , తరహాలో ప్రభతవాన్ని ఏర్పాటు చేస్తారా  అనే దాని పై స్పష్టత రాలేదు . కాంగ్రెస్స, ఏం ఐ ఏం  పార్టీ లు  భారతీయ జనతా పార్టీ తో జత కట్టే అవకాశం లేదు . ఎన్నికల తర్వాత  బి ఆర్ ఎస్ తో నే కలిసి ప్రభత్వం ఏర్పాటు చేస్తారనే సంకేతాలు ముందుగానే ఇచ్చారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి . ఇక బి ఎల్ సంతోష్  ముఖ్య మంత్రి  ఎవరు అనే ప్రశ్నకు మాది జాతీయ పార్టీ ఎన్నికైన పార్టీ  సభ్యలు తమ  నేతను ఎన్ను కుంటారని చెప్పారు 

భారతీయ జనతా పార్టీ లో  కీలకమైన నేత ,కర్ణాటక ఎన్నికలను  అన్నీ తానై నడిపించిన సంతోష్ నాయకుల ను హెచ్చరించిన తీరు, అసెంబ్లీ ఎన్నిక ల ఫలితాలు  హాంగ్  దిశగా ఉంటాయని చెప్పడం,రాబోయే ప్రభత్వం లో   భారతీయ జనతా పార్టీయే కే రోల్ పాత్ర పోషిస్తుందని చెప్పడం సర్వత్ర చర్చ నీయాంశం అయ్యింది 

ఉండే వారుంటారు .. వెళ్ళే వాళ్ళు వెళతారు.. వచ్చే వారు వస్తారు .. 

భారతీయ జనతా పార్టీ  లో తరచూ అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేతల పై  బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌.  ఫైర్ అయ్యారు పార్టీలో కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటూ అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేతలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. టీబీజేపీలో కొందరు అసమ్మతి నేతలు ప్రధాని తెలంగాణ  పర్యటనను  సీరియస్‌గా తీసుకోక పోవడమే కాకుండా   ప్రధాని సభల్లోనూ పాల్గొనలేదు. విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,కొండ విశ్వేశ్వర రెడ్డి. వివేక్ తో మరికొంత మంది నేతలు  ప్రధాని సభలకు డుమ్మా కొట్టారు. ఈ తరుణంలో బీఎల్‌ సంతోష్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.పార్టీలోకి వచ్చేవారు వస్తారు. వెళ్లేవారు వెళ్తారు. వారి కోసం పార్టీ సంస్థాగత విధానం మారదని తేల్చి చెప్పారు  పార్టీలోకి వచ్చేవారు వస్తారు. వెళ్లేవారు వెళ్తారు. వారి కోసం పార్టీ సంస్థాగత విధానం మారదని తేల్చి చెప్పారు ప్రస్తుతమున్న పోలింగ్‌ బూత్‌ కమిటీలు, శక్తి కేంద్రాలు, బైఠక్‌లు కొనసాగుతాయని  బి ఎల్ సంతోష్  ఘాటుగా చెప్పారు 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here