TT Ads

హైకోర్టులో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ఊరట. లభించింది .ఎమ్మెల్యేల కొనుగోలు కేస్ లో సిట్ ఆయనకు లుక్ ఔట్ నోటీస్ జారీ చేసింది..దీనిపై ఆయన తనకు సంబంధం లేని కేసు లో  చేర్చారరని  హైకోర్టు ను  ఆశ్రయించారు.. BL సంతోష్ కుమార్ తరపున   న్యాయవాది  మాజీ అద్వకటే జనరల్ ప్రకాష్ రెడ్డి వాదించారు.ఆయనకు సిట్ ఇచ్చిన 41 CRPC నోటీసుపై స్టే ఇచ్చిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం . ఎంఎల్ఏలకు ఎర కేసులో ఎంఎల్ఏ పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన పిటీషన్‌లో పేరు లేకున్నా ఎఫ్ఐఆర్ లో ఎలా చేర్చారని అభ్యంతరం  వ్యక్తం చేసారు.  ప్రభుత్వ ,న్యాయవాది వాదనలు విన్న  హై కోర్ట్ బి.ఎల్.సంతోష్  పోలీస్ లు ఎటువంటి చర్యలు తీసుకోకుండాస్టే మంజూరు చేసింది. 

సిట్ జారీ చేసిన నోటీసుల అమలును నిలుపుదల చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబరు 5కి వాయిదా వేసింది. 

వాదనల సందర్భంగా బీఎల్ సంతోష్ తరఫు న్యాయవాది స్పందిస్తూ…. ముందు నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం కొన్ని పనులు ఉన్నందువల్ల తన క్లయింటు బీఎల్ సంతోష్ కోర్టుకు రాలేకపోయారని న్యాయమూర్తికి తెలియజేశారు. 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *