ఇక ఫోన్‌లో ఇంటర్నెట్‌ డేటా లేకున్నా.. TV, OTT ప్రసారాలు చూడొచ్చు..!

0
16

ఫోన్‌లో ఇంటర్నెట్‌ డేటా లేకున్నా.. TV, OTT ప్రసారాలు చూడొచ్చు..! కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది..!

బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ.. మొబైల్స్‌లో ఎఫ్ఎం రేడియో ట్రాన్స్‌మిషన్ తరహాలోనే డీ2ఎం టెక్నాలజీ రూపుదిద్దుకుంటుంది. దీని ప్రకారం రేడియో తరంగాలను ఫోన్ రిసీవర్ స్వీకరిస్తుంది. ప్రస్తుతం టీవీ చానళ్ల ప్రసారానికి వాడుతున్న 526-582 ఎంహెచ్‌జడ్ బాండ్‌ను డీ2ఎంలో వినియోగం కోసం కసరత్తు జరుగుతోంది.

ప్రస్తుతం దేశంలో 21-22 కోట్ల కుటుంబాలకు టీవీలుంటు.. 80 కోట్ల మందికి పైగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. 2026 నాటికి మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో అతిపెద్ద కంటెంట్‌ వేదికగా మొబైల్ ఫోన్లు నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

దీంతో మొబైల్‌ వినియోగదారులో లక్ష్యంగా కేంద్రం కసరత్తు షురూ చేసింది. మరోవైపు ఈ డైరెక్ట్ 2 మొబైల్ (Direct to Mobile) టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. టెలిఫోన్ ఆపరేటర్ల డేటా రెవెన్యూలో 80 శాతం పడిపోయే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనలపై టెలికా ఆపరేటర్లు నిరసన తెలిపే అవకాశాలున్నాయి.

డైరెక్ట్-టు-మొబైల్ (D2M) టెక్నాలజీ అంటే ఏమిటి?

D2M సాంకేతికత సక్రియ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా నేరుగా మొబైల్ ఫోన్‌లకు వీడియో మరియు ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది

.ఇది బ్రాడ్‌బ్యాండ్ మరియు ప్రసారాల కలయికపై ఆధారపడి ఉంటుంది. ఈ సాంకేతికతను ఉపయోగించి, మొబైల్ ఫోన్‌లు టెరెస్ట్రియల్ డిజిటల్ టీవీని అందుకోగలుగుతాయి

ఇది మొబైల్ ఫోన్‌లలో FM రేడియోను పోలి ఉంటుంది, దీనిలో ఫోన్ రేడియో ఫ్రీక్వెన్సీలను ట్యాప్ చేయగలదు.ఇది స్పెక్ట్రమ్ వినియోగాన్ని మరియు బ్రాడ్‌బ్యాండ్ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here