TT Ads

వచ్చే ఎన్నిల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత‌లు ప్ర‌క‌టించారు. యువత భవిష్యత్‌ కోసం యువ గళం పేరుతో పాదయాత్ర కు టీడీపీ శ్రీ‌కారం చుడుతోంది. యువత మద్దతు కోసం నారా లోకేష్ గ‌ట్టి ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు, యూత్ ఓటర్లపై టీడీపీ గురి పెట్టింది. పాదయాత్రతో వారి అభిమానాన్ని పొందాలని టీడీపీ యువనేత లోకేష్ ప‌క్క ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. వంద నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొన‌సాగుతోంది. లోకేష్ వ్యూహాత్మకంగా యువ‌త‌, మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసుకుని పాదయాత్ర చేయాలని నిర్ణ‌యించారు. యువత, మహిళలు, రైతుల సమస్యలను ప్రతిబింబించేలా పాదయత్రను నిర్వహించనున్నారు.

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ ఈ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా యాత్ర సాగనుంది. పాదయాత్రలో యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలనీ నిర్ణయించారు. ఏపీలో రాజకీయంగా చైతన్యవంతమైన యువత ఎక్కువగా ఉంటారు. వారిలో ఏ ఇద్దరు యువకులు కలిసినా రాజకీయాలపై చర్చించుకుంటారు. దాదాపుగా అందరికీ రాజకీయ పరంగా క‌చ్చిత‌మైన‌ అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఇలాంటి యువత మద్దతు పొందడం చాలా క‌ష్గం. ఆధికారంలోకి రావాలంటే వారి మద్దతు పొందాల్సిందే. గ‌త‌ ఎన్నికల సమయంలో టీడీపీ యువత కోసం చాలా కార్యక్రమాలు చేసినట్లుగా చెప్పుకున్నా వాటికి యువత క‌నేక్ట్ కాలేద‌నే చెప్ప‌వ‌చ్చు. అందుకే ఇప్పుడు నారా లోకేష్ యువతను టార్గెట్ చేస్తూ పాద‌యాత్ర‌ను స్టార్ట్ చేస్తున్నారు. వారిని మళ్లీ టీడీపీ వైపు తీసుకొచ్చేందుకు యువగళం అని పేరుతో పాద‌యాత్ర‌ను ప్లాన్ చేశారు.

జగన్ ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్టపోతున్న యువతకు ప్రశ్నించే వేదికను కల్పించేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది. చాలా నిరాడంబంరంగా యువ గళం పాదయాత్ర సాగుతుందని ఆ పార్టీ నేత‌లు తెలిపారు. యువతను ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. వారి భవిష్యత్‌ కోసం ప్రణాళికలు రూపొందించేందుకేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు.. జగన్ వచ్చిన తర్వాత మూడున్నరేళ్లపాటు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలతోపాటు అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. వారందర్నీ కలిసేలా వారి సమస్యలు తెలుసుకునేలా యాత్రను కొన‌సాగించేలా రూట్ మ్యాప్ సిద్దం చేసుకుంటున్నారు టీడీపీ శ్రేణులు.

సి ఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలా హంగు ఆర్బాటం లేకుండా ఈ పాదయాత్ర చాలా సింపుల్‌గా నిర్వాహించాల‌ని పార్టీ నేత‌లు డిసైడ్ చేశారు. యువత ఉజ్వల భవిష్యత్‌ కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను జగన్ సర్కారు రద్దు చేసింది.. దీని వల్ల అన్ని వర్గాల ప్రజల్లో అసహనం పెరిగి పోయింది. వారిందర్నీ కలిసి వారి భవిష్యత్ బాగు కోసం వారి స‌మ‌క్షంలోనే వారి ఆలోచనలు ప‌రిగ‌ణ‌న లోకి తీసుకొని స‌రైనా నిర్ణ‌యం తీసుకొవాల‌ని నిర్ణ‌యించారు. ఏపీలో అన్ని వర్గాలు ప్రభుత్వ విధానాలతో విసిగిపోయాయి…నాలుగు రోజులకో యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. వీటిని ప‌రిష్కరించ‌టంలో ప్రభుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని టీడీపీ నేత‌లు విమర్శించారు.

మహిళలపై వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న మాదకద్రవ్యంతో యువత నాశనమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా మూలాలు ఏపీ వైపే చూపిస్తున్నాయని దీన్ని నియంత్రించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదన్నారు. దీని వల్ల నిరుద్యోగం పెరిగిపోతోందని… ఈ సమయంలో యువత భవిష్యత్‌కు భ‌రోస ఇచ్చేందుకు యువ గళం వినిపించాల‌ని పాదయాత్ర ప్రారంభిస్తున్నాట్లు పార్టీ వ‌ర్గాలు వివ‌రించాయి.

ప్రస్తుతం తాము అధికారంలో లేమని, సమస్యలు తెలుకోవడం వాటి పరిష్కార మార్గాలను అన్వేషించడానికే ఈ యాత్ర చేస్తున్నట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా, ప్రజలకు, యువతకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో యాత్ర చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువత ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. టీడీపీకి మహిళల మద్దతు మొదటి నుంచి ఉందని ఆ పార్టీ నేతలు చెబుతూంటారు, అయితే ఈ సారి పాదయాత్ర ద్వారా వారి మద్దతు కొనసాగేలా చూసుకుని..యువత, మహిళల మద్దతుతో టీడీపీని అధికారంలోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో లోకేష్ ముందుకు సాగుతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

టీడీపీలో ఈ సారి పూర్తిగా తెరపైకి యువతరమే రానుంది. లోకేష్, రామ్మోహన్, పరిటాల శ్రీరాం లాంటి వాళ్లు ఇప్పటికే స్పీడ్‌మీద ఉన్నారు. వారసులు మాత్రమే కాకుండా.. కింది స్థాయి నుంచి ఎదిగిన యువ నేతలకు ఈ సారి చంద్రబాబు, లోకేష్ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని టీడీపీ వర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. టీడీపీకి యువతలో మంచి ఆదరణ ఉంది. అభివృద్ధి రాజకీయాలు ఓ కారణం అయితే.. ఐటీ, పరిశ్రమల స్థాపనలో టీడీపీ ప్రభుత్వం ముందుండడం మరో కారణం. అందుకే ఈ సారి యువ నేతలను తెరపైకి తీసుకువ‌స్తున్నారు టీడీపీ నేతలు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *