తెలంగాణలో కాంగ్రెస్ వైపు చూస్తోన్న ముస్లింలు..కలవర పడుతున్న గులాబీ నేతలు..!

0
7

బీఆరెస్‌-బీజేపీ దోస్తీతో ముస్లిం ఓటర్లలో అనుమానాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణలు ప్రజల్లో ఆలోచనలు శరవేగంగా మారిపోతున్నాయి. బిజెపి బీఆర్ఎస్ పార్టీలు ఎంతగా దుమ్ము ఎత్తిపోసుకుంటున్నా ప్రజలు  విశ్వసించడం లేదు. కెసిఆర్ పదేళ్ల పాలన పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బి.ఆర్.ఎస్ ఎన్నో పధకాలు అమలు  చేస్తొంది. కర్నాటక కు మించి కాంగ్రెస్ హామీలు ఇవ్వడం తో ప్రజలంతా వన్ సైడ్ ఆలోచన తో ముందుకు వెళుతున్నారు..వ్యతి రేక ఓటును భారతీయ జనతా పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రజలు వారిని విశ్వసించడం లేదు. భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి రెండు ఒకటేనని భావన  ప్రజల్లో రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటివరకు ముస్లింల మీద కోటి ఆశలతో ఉన్న భారత రాష్ట్ర సమితి కి మైనార్టీలు చేయి ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. ఓవైసీ ఎంత ప్రయత్నిస్తున్న ముస్లిం వర్గాలు బి.ఆర్.ఎస్ కు అనుకూలంగా ఓటు వేయడానికి ఇష్టపడటం లేదు. ఎప్పుడు లేని విధంగా మజ్లీస్ కు కంచుకోటగా ఉన్న పాతబస్తీలో సైతం ముస్లింలు  ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ కు  ఓటు వేయకపోతే తమ వర్గానికి భవిష్యత్తు లేదనే భావన మైనార్టీ వర్గాల్లో  బలంగా పెరిగిపోతుంది

బి . జె. పి లో ఊపు తగ్గడం .. కవిత కేసు పెండింగలో పెట్టడం..

 బీజేపీలో ఊపు తగ్గిపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడం లాంటి రకరకాల పరిణామాలు మైనార్టీల్లో పలు అనుమానాలకు తావిస్తున్నాయని చెబుతున్నారు.

ఎక్కువ శాతం ప్రజలు మాత్రం బీజేపీతో బీఆరెస్  మద్య నడిచే మాటల యుద్దం సినిమా డైలాగ్ గా భావిస్తున్నారు 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి వస్తే బీజేపీ మద్దతు తప్పకుండా బీఆరెస్‌కే ఉంటుందనే అనుమానాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ అనుమానం ఎప్పుడైతే బలపడుతదో అప్పుడు ముస్లింలు బీఆరెస్ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం  స్పష్టంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బి.జె.పి బి ఆర్ ఎస్ మజ్లీస్ పార్టీ లు ఒకే లైన్ లో ఉన్నాయని  చెప్పిన మాటలు కరుడుగట్టిన  ఎం ఐ.ఎం నేతలను కూడా ఆలోచనలో పడేసిసింది.  మజ్లీస్ నేతలు సలావుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్లు కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేస్తూ విమర్శలు చేయడమే ముస్లింలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనడానికి సాక్ష్యం అని రాజకీయ వర్గాలు అంటున్నాయి  మొత్తం మీద ముస్లింలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారని స్పష్టం అవుతుంది. దేశ వ్యాప్తంగా ముస్లింలు కాంగ్రెస్ వైపు చూపుతుందం తో బి.ఆర్.ఎస్ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు కర్ణాటక తరహాలో ఫలితాలు ఉంటాయేమో అని కలవర పడుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here