TT Ads

వైసిపి లోకి ముద్రగడ …

కాకినాడ లోక్ సభ నుంచి పోటీ చేసే యోచనలో ముద్రగడ 

పిఠాపురం నుంచి వంగా గీత?

రాజకీయాలను పూర్తిగా అంచనా వేయలేం. ఏ రోజున ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేని పరిస్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయి. ఉద్యమాలకు సంచలనాలకు మరో పేరైన రాజకీయ కేసరి,కొదమ సింహం ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రాజకీయాల్లో పంజా విసరనున్నారు.
కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రాజకీయ ఊహాగానాలకు త్వరలో తెరదించనున్నారు. ఏ పార్టీలో చేరేది, ఎక్కడి నుంచి పోటీ చేసేది దాదాపుగా నిర్ణయించుకున్నారు. అదే జరిగితే రాజకీయంగా హాట్ టాపిక్ కానుంది.

కాపు ఉద్యమం తరువాత చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పిన ముద్రగడ అందుకు తగ్గ ముహూర్తం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. మరి ఏ పార్టీలో ఎప్పుడు చేరనున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే వివరాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.

2009 నుంచి క్రియాశీలక రాజకీయాలను దూరంగా ఉన్న ముద్రగడ పద్నాలుగు సంవత్సరాల అనంతరం రాజకీయ ఆరంగేట్రం చేయనున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం మహోధృతమైంది. టీడీపీ ప్రభుత్వ పునాదుల్ని కదిలించేసింది. ఆ తరువాత చాలాకాలంగా అన్నింటికీ దూరంగా ఉన్నారు. కాపు ఉద్యమం సమయంలో తునిలో జరిగిన హింసాత్మక ఘటనల నేపధ్యంలో అప్పట్లో రాష్ట్ర, రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ముందు రాష్ట్ర పోలీసులు పెట్టిన కేసులు మాఫీ అయ్యాయి. ఇటీవలే రైల్వే కేసుల్లో కూడా కాపు నేతలకు క్లీన్‌చిట్ లభించింది.

ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు అనుకూలంగా ఉంటూ వచ్చారు. ఇటీవల త్వరలోనే రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ఇప్పుడా సమయం వచ్చినట్టే అన్పిస్తోంది. పొలిటికల్ రీ ఎంట్రీ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మే నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. అతనితో పాటు కుమారుడు కూడా వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. కాకినాడ ఎంపీ లేదా పిఠాపురం అసెంబ్లీకు పోటీ చేయవచ్చని తెలుస్తోంది.

ముద్రగడ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి. కాపు ఉద్యమనేతగా, సీనియర్ రాజకీయ నేతగా అందరికీ సుపరిచితులు. పాత, కొత్త తరం నేతలతో రాజకీయాలు నడిపిన ఘనత ఆయనది. ముద్రగడ ఏదైనా ఉద్యమం చేపట్టారంటే అది సక్సెస్ అయినట్టే అర్ధం.

ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ వార్తలు రాగానే అప్పుడే ఆయన నివాసానికి రోజు రోజుకు సందడి పెరుగుతోంది. కాపు నేతలు, అభిమానులు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు కలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు లేవు. జనసేన నేతలు ఇప్పటివరకూ సంప్రదింపులు జరపలేదు. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. కాకినాడ ఎంపీ కంటే పిఠాపురం అసెంబ్లీనే ఎంచుకోవచ్చని సమాచారం. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే
బిజెపి కూడా ముద్రగడకు గేలం వేస్తొంది.కేంద్ర నిఘా వర్గాలు కథనం ప్రకారం యువకులు జనసేన ను బలపరుస్తుంటే మిగిలిన వారు ముద్రగడ ఆదేశాలు ప్రకారమే వ్యవహరించనున్నారు.నాలుగుశాతం పవన్ వైపు ఉండగా పదహారు శాతం ముద్రగడ వైపు ఉన్నారని కేంద్ర నిఘావర్గాలు వివరిస్తున్నాయి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *