TT Ads

రాజస్థాన్ సరిహద్దులో భారీ మొత్తంలో మిడతల గుడ్లు.. ప్రమాదానికి సంకేతం అంటూ హెచ్చరిక.

మిడతలు ఎప్పుడూ గుంపులు గుంపులుగా ఎగురుతాయి. కోట్లాది మిడతలు ఒకే గుంపుగా ఉంటాయి. ఈ మిడతల దండు ఎక్కడ ఏ ప్రదేశంలోని పంటపై వాలితే.. ఆ ప్రదేశంలోని పంటలు కొన్ని నిమిషాల్లోనే మాయం అవుతాయి. 40 మిలియన్ల మిడతల సమూహం.. ఒక రోజులో తినే ఆహారం.. దాదాపు 35,000 మందికి సరిపడేటంత ఉంటుంది. కనుక మిడుతల చాలా ప్రమాదకరమైనవి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మిడతల దండు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇవి ఒక్కసారి పొలాలమీద పంటల మీద పడ్డాయంటే చాలు.. బీభత్సం సృష్టిస్తాయి. ఈ గుంపులు ఎంత ఆహారం అయినా సరే గుటుక్కుమనిపించేస్తాయి. అయితే ఇప్పుడు మనదేశానికి మరోసారి మిడతల ముప్పు పొంచి ఉంది. రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో మిడతల గుడ్లు భారీ మొత్తంలో కనుగొన్నారు. రాజస్థాన్‌లో మిడతల నియంత్రణ బృందం సర్వే ప్రకారం.. ఈ గుడ్ల నుండి మిడతల ఆవిర్భావ ప్రక్రియ ప్రారంభమైందని.. ఇది ప్రమాదానికి సంకేతమని తెలుస్తోంది.

ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే FAO ప్రకారం ఒక చదరపు కిలోమీటరులో విస్తరించి ఉన్న మిడతల సమూహంలో దాదాపు నాలుగు కోట్ల మిడతలు ఉంటాయి. వ్యక్తి సగటు ఆహారాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఒక మిడత దాని బరువుకు సమానమైన ధాన్యాలను తింటుంది. మిడుతలు పంటలను మాత్రమే కాకుండా చెట్లు, మొక్కలను కూడా తమ ఆహారంగా చేసుకుంటాయి. పువ్వులు, విత్తనాలు, బెరడులను తింటాయి. .

రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కనిపించిన మిడత గుడ్లు పాకిస్తాన్ నుండి వచ్చాయని, వాస్తవానికి మిడతలు భారతదేశానికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాయని చెబుతున్నారు. అవి ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారతదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముడుతల గుంపు తాము ప్రయాణించే దారిలో ఉన్న పంటను దెబ్బతీస్తాయి. మిడతల దండు ప్రమాదం భారత్, పాక్ వంటి దేశాలకు మాత్రమే కాదు.. ఆఫ్రికన్ దేశాల్లో కూడా మిడతల గుంపు పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

మిడతల జనాభా చాలా వేగంగా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మిడతల జీవిత కాలం కేవలం 3 నుండి ఐదు నెలలు. అయితే ఒక ఆడ మిడత తన జీవితకాలంలో మూడుసార్లు గుడ్లు పెడుతుంది, ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఒకసారి పెట్టిన గుడ్ల సంఖ్య 70 నుంచి 150 వరకు ఉంటుంది. మిడుతలు ముఖ్యంగా తేమతో కూడిన ప్రదేశాలలో కనిపిస్తాయి. అందుకే వర్షాకాలం తర్వాత వీటి ప్రభావం అధికంగా ఉంటుంది.

మిడతల గుంపు ప్రత్యేకత ఏమిటంటే అవి గాలిలో తేలుతూ వెళ్తాయి. సాధారణంగా గంటకు 13 కి.మీ. వేగంతో ఎగురుతూ ఒక రోజులో 150 నుండి 200 కిమీ వరకు ప్రయాణిస్తుంది. మిడతల గుంపు పంటపై వాలితే.. 20 నుండి 25 నిమిషాల్లో అక్కడ ఉన్న పంటలు, మొక్కలను నాశనం చేయగలవని నిపుణులు భావిస్తున్నారు

మిడతల దాడిని నివారించడానికి, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సలహా కూడా జారీ చేస్తుంది. దాని కింద ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ ప్రకారం, భారతదేశంలో మిడుత దాడుల చరిత్ర పాతది. రికార్డుల ప్రకారం, 1812 నుండి మిడతలు నిరంతరం దాడి చేస్తున్నాయి. విశేషమేమిటంటే.. 1926లో ఈ ముడుతల దండు చేసిన దాడి వల్ల భారతదేశంలో రూ.10 కోట్లకు పైగా విలువైన పంటలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు 1940 నుండి ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి మిడతల సమూహం భారతదేశంలో దాడి చేస్తూ ప్రతిసారీ లక్ష నుండి రెండు కోట్ల రూపాయల పంటలను నాశనం చేస్తుంది.

ఇప్పటి వరకూ భారతదేశంలో 2020లో జరిగిన మిడతల దాడి పెద్దది. కరోనా మహమ్మారి సమయంలో, మిడతల సమూహం చాలా వినాశనానికి కారణమైంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం అప్పట్లో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో 50 వేల హెక్టార్లకు పైగా పంటలు నాశనమయ్యాయి

.

మిడతల సమూహాలను ఎదుర్కోవడానికి నియంత్రణ , పర్యవేక్షణ మాత్రమే ఏకైక మార్గం. ఎడారి మిడుత సమాచార సేవ భారతదేశానికి హెచ్చరికలను జారీ చేసింది. మిడతలు ఒక ప్రాంతంపై దాడి చేసినప్పుడు, వాటిని భారీ శబ్దాలతో తరిమివేయాలని సూచించారు. అంతేకాదు గాలిలో పురుగుల మందు కూడా చల్లాల్సి ఉంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *