TT Ads

చంద్రబాబు కుప్పం పర్యటన

టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి

*పది మందికి గాయాలు

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. కుప్పం నుంచి వెళ్లాల్సిన ప్రచార రథం, ఇతర వాహనాలను నిలిపివేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. శాంతిపురం మండలం ఎస్‌.గొల్లపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఇదేంఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నారు. దీనిలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, నేతలు శాంతిపురం చేరుకుంటున్నారు.అయితే ఎక్కడికక్కడ పోలీసులు తమ ఆంక్షలతో వారిని అడ్డుకుంటున్నారు. చంద్రబాబు పర్యటన మార్గాల్లో బారికేడ్లు పెట్టి కార్యకర్తలను నియంత్రిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్‌.గొల్లపల్లి వద్ద కూడా ఇలాగే అడ్డుకోవడంతో పోలీసులు-తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో మహిళా కార్యకర్తలతో పాటు 10 మందికి గాయాలయ్యాయి. లాఠీఛార్జ్‌, తోపులాటలో తెదేపా మండల మహిళా అధ్యక్షురాలు స్పృహ తప్పి కిందపడియారుకాసేపట్లో చంద్రబాబు.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు రానున్నారు. రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించనున్నారు. రేపు కుప్పుం తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 6న గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది.. పర్యటన అనంతరం రాత్రికి కుప్పంలో బసచేస్తారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *