TT Ads

అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది. చీడికాడ మండలం కోనాంలోని పంట పొలాల్లో ఏకంగా 12 అడుగుల గిరినాకు జనాలను పరుగులు పెట్టించింది. ఉదయాన్నే పొలం పనుల కోసం వెళ్లిన రైతులు బుసలు కొడుతున్న కింగ్‌ కోబ్రాను చూసి భయంతో పరుగులు  తీశారు

. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఇద్దరు స్నేక్‌ క్యాచర్స్‌ గిరినాగును బంధించేందుకు చాలాసేపు శ్రమపడ్డారు. ఎట్టకేలకు ఎంతో చాకచక్యంగా కింగ్‌కోబ్రాను బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో రైతులు, స్థానికులు ఊపిరితీసుకున్నారు. వరుసగా కింగ్ కోబ్రాలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో కింగ్ కోబ్రాలు బుసలు కొడుతున్నాయి. పామాయిల్ తోటలతో పాటూ జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. విషసర్పాల సంచారంతో అవి కనిపించిన ప్రాంతాల ప్రజలు భయపడిపోతున్నారు. ఇటీవల అనకాపల్లితో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమయ్యాయి.

ఇలాంటి కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైనవి కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు స్పందించి ఈ పాములను పట్టుకుని… దూర ప్రాంతాల్లో విడిచి పెట్టాల్ని కోరుతున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *