కేసీఆర్ అనుకుంటే ఏదైనా, ఎంతకైనా తెగిస్తారు.. అనుకున్నది సాధిస్తారు అదే గులాబీ బాస్ లో ఉన్న ధైర్యం.. సాహసోపేతమైన నిర్ణయం గా చెప్పుకుంటారు.. అన్నట్లుగానే సీఎం కేసీఆర్ మరో మూడు నెలల్లో ఎన్నికలను పెట్టుకొని, దానికి సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించి టికెట్ రాని అభ్యర్థులను మంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసిన హాట్ టాపిక్ గా మారుతుంది.. ప్రధానంగా గతంలో ఎన్నడూ లే విధంగా అభ్యర్థులను ప్రకటించిన అనంతరం మంత్రి వర్గ విస్తరణ చేయడం వంటి నిర్ణయంతో చరిత్రలో నిలిచిపోనున్నారు..
తెలంగాణలో ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే.. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి సవాల్ విసిరారు.. మరోవైపు.. దాదాపు సిట్టింగ్ లకు మరో అవకాశం.. ఇన్ని రోజులుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆశావహులను బుజ్జగించేందుకు గాని.. సంతృప్తి చెందని వారు వేరే వారి వద్దకు వెళితే జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి. పార్టీలు.. కావాల్సినంత సమయం దొరికే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. అదే సమయంలో నేడు మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. పోటీ చేసేందుకు టిక్కెట్టు ఆశించి తనకు వెన్నుపోటు పొడిచిన కీలక వ్యక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు.
అయితే మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌కు ఉద్వాసన పలకడంతో ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ సమయంలో, గులాబి బాస్ ఆ స్ఠానాన్ని పూరించడానికి కొత్త స్కెచ్‌ను రూపొందించారు. అయితే.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014లో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మహేందర్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన సబితా రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడంపై మహేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో పార్టీ మారతారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్ప టికే టికెట్ ఇవ్వక పోవడంతో మూడు నెలలుగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇప్పించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి.. ఇద్దరూ రంగారెడ్డి జిల్లాకు చెందినవారే కావడంతో.. ఇప్పుడు ఆమె ఒంటరిగా మిగిలిపోతారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడటంతో మహేందర్ రెడ్డికి చోటు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.