TT Ads

ఖమ్మం: ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని తెలిపారు. భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులనుద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… భారాస విధానం, వ్యూహం తర్వాత వివరంగా చెబుతామన్నారు. భారత్‌ అన్ని విధాలా సుసంపన్నమైన దేశం. జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామి. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కానీ, కేవలం 20వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. బకెట్‌ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాస్తోంది. చైనాలో 5వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ ఉంది. మన దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్‌ ఉందా? రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చింది. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు కాదా?. రూ.లక్ష కోట్ల విలువైన పామాయిల్‌ దిగుమతి చేసుకుంటున్నాం. దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయింది. ఈదేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ 4.10లక్షల మెగావాట్లు. దేశం ఎప్పుడూ కూడా 2.10లక్షల కోట్ల మెగావాట్లు మించి వాడలేదు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి. వీటన్నింటిని రూపుమాపేందుకే భారాస ఆవిర్భవించింది. దేశ దుస్థితికి కాంగ్రెస్‌, భాజపానే కారణం. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే భాజపాను తిడుతుంది. భాజపా అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుంది. భారాస అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్‌ను తయారు చేస్తాం. దేశంలో రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వాల్సిందే. భారాస అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌ ఇస్తాం. రైతు బంధు స్కీమ్‌ దేశమంతా అమలు చేయాలన్నదే భారాస విధానం. ఎన్‌పీఏల పేరుతో రూ.14లక్షల కోట్లు దోచి పెట్టారు’’ అని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *