TT Ads

ప్రస్టేషన్ సీఎం కేసీఆర్

,— రెండో రోజు సభల్లో తడబాటు

— పాడిందే పాట .. చెప్పిందే చెప్పుడు
— కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ….అంటూ పదేపదే రెచ్చగొట్టే మాటలు

— కొంప ముంచుతున్న రైతు రుణమాఫీ

— జనగామ, భువనగిరిలో ఆకట్టుకోని కెసిఆర్ స్పీచ్

కొండం అశోక్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
ఫోన్: 9603322489

ఏ ఆర్ మీడియా, ఏసియన్ మీడియా హైదరాబాద్:

మొత్తం మీద తెలంగాణ ప్రజలు అనుకున్నదే జరుగుతుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుపై ప్రజలు పెద్ద ఎత్తున అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఈ దరిమిలా, ఆ పార్టీ చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కుబడిగా ప్రసంగాలు చేస్తూ ముగించేస్తున్నారు.. అయితే స్థానిక నాయకులు రూ. కోట్లు ఖర్చుపెట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ ఏర్పాటు చేస్తే, కేవలం పావుగంట, పది నిమిషాల్లో సీఎం కేసీఆర్ తమ ప్రసంగాన్ని ముగించేశారు..

టైం అయిపోయింది , హెలికాప్టర్ రాత్రయితే ఎగరదు. ఇదో పెద్ద ఇబ్బంది.. అంటూ తన ప్రసంగాన్ని ముగించి తుర్రుమని జారుకుంటున్నారు.. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సీఎం కేసీఆర్ ప్రసంగంలో ఎలాంటి వాడి వేడి లేకుండా, చప్పగా సాగుతోంది.. “పాడిందే పాట” అన్నట్టుగా, నిన్నటి నుంచి నిర్వహిస్తున్న ప్రచార సభలలో ఒకే తీరు మాటలతో, ఒకే టాపిక్ ను, మళ్లీ మళ్లీ చెబుతూ సినిమా రీల్ ను తిప్పినట్లుగా ఉంది… మొత్తం మీద ప్రజల ” వేవ్” ను గమనించిన సీఎం కేసీఆర్ పదేపదే జనగామ భువనగిరి సభల్లో “కాంగ్రెస్ పార్టీ మళ్లీ వస్తే” అంటూ తన మనసులోని భయాన్ని బయట పెట్టినట్లు అయింది.. ఒకరకంగా, సీఎం కేసీఆర్ నిన్నటి హుస్నాబాద్, నేటి జనగామ, భువనగిరి సభల్లో మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన ప్రెస్టేషన్లోకి వెళ్లినట్లు అర్థమవుతుంది.. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 స్కీములను కాపీ కొట్టి , ఆ మొత్తానికి , మరింత మొత్తాన్ని కలిపి ఎక్కువ చేసి చూపించటం గమనార్హం.. జనగామలో నిర్వహించిన సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి, మేమంతా ఒక్కటే అన్నట్లుగా ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, టికెట్ లభించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్తగా చేరిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ప్రజలను నమ్మించాలని చూసినా, ఆ మేరకు, వారి నుంచి స్పందన రాకపోవడం పార్టీ నేతలను నిరుత్సాహంలోకి నెట్టింది.. అయితే ,ఈ నేతలంతా జనగామ నియోజకవర్గంలో కలిసి పనిచేస్తారనే నమ్మకం మాత్రం సన్నగిల్లింది.

ఆవేశంతో కన్నీళ్లు పెట్టిండట:

కాగా జనగామలో తన ప్రెస్ స్టేషన్ లో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.. ఒకప్పుడు అంట.. జనగామ ప్రాంతంలో కరువు తాండవించింది.. ఎక్కడ చూసినా బీడు భూములే… తాగుదామంటే నీళ్లు లేని పరిస్థితి.. ఆ సందర్భంలో నేను ఈ ప్రాంతాలన్నీ తిరిగి చూసినా.. కళ్ళల్లో నీళ్లు తిరిగినయ్ .. అని చెబుతూ ఓ బహిరంగ సభలో “ఆవేశం పట్టలేక కళ్ళనీలతో ఏడ్చిండట”

.. ఎవరైనా ఆవేశమస్తే కళ్ళ నీళ్లతో ఏడుస్తారా..? ఇదేమి మాటలు స్వామి.. అంటూ సబికులు నవ్వుకున్నారట…
అసలు ఏం మాట్లాడుతున్నాడో, తెలియని పరిస్థితుల్లో ప్ర స్టేషన్ కి గురైనట్లు ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది ..

ఇక భువనగిరి సభ కేవలం పదే, పది నిమిషాల్లో ముగించేశారు.. రూ. లక్షలు ఖర్చుపెట్టి గత నాలుగు రోజులు గా కష్టపడి జన సమీకరణ చేసిన స్థానిక నాయకులకు కేసీఆర్ ప్రసంగం చూసి నెవ్వర పోయారట.. జనాలు మస్తుగా వచ్చారు… భువనగిరిలో ఈసారి 50వేల మెజార్టీతో శేఖర్ రెడ్డిని గెలిపించాలని, ఇక్కడ, సర్వేలు కూడా శేఖర్ రెడ్డికి మెజార్టీ వస్తుందని చెప్పటం కోస మెరుపు..

ఆనాటి యాస కనుమరుగు:

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ యాస భాషను పూర్తిగా మర్చిపోయినట్లున్నారు… ఎక్కువగా జనం వాడుకునే భాషలోనే మాట్లాడుతూ, తెలంగాణ మాండలికాన్ని విరివిగా వాడుతుంటారు… అయితే ఈసారి పెద్దగా తెలంగాణ యాసను తన ప్రసంగాలలో చెప్పకపోవడం కొంత నిరాశకు గురిచేసింది… ప్రధానంగా ఈ మూడు బహిరంగ సభలలో సీఎం కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో తో పాటు ధరణి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి అంశాలను చెప్పారు.. స్థానికంగా కొన్ని సమస్యలను కూడా పరిష్కరించినట్లు చెప్పారు

.. కానీ , అవి ఏ మేరకు పరిష్కారం అయ్యాయి..? సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఎంతవరకు అమలయ్యాయి.? ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతమందికి లబ్ధి చేకూర్చాయి
..? వీటిలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరిగాయి..? నిజంగా లబ్ధిదారులకు ఈ పథకాలు అందాయా..? అనే అంశాలపై ప్రజలు తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు .. ఈ అంశాలపై సీఎం కేసీఆర్ స్వయంగా గ్రౌండ్ రిపోర్టు తెప్పించుకుంటే, పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనే విషయం అర్థమవుతుంది..

కొంప ముంచనున్న రైతు రుణమాఫీ:

ప్రధానంగా రూ. లక్ష రైతు రుణమాఫీ సీఎం కేసీఆర్ కొంపముంచనున్నది. ఎందుకంటే, సగటున ఒక్కో రైతు రూ. 60 వేల రుణం తీసుకుంటే, ఇప్పుడు అది కాస్త రూ.లక్ష ఇరవై వేలకు చేరుకుంది.. రుణమాఫీ పూర్తి చేసిన అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులంతా సంతోష పడ్డారు.. ఇక తమ రుణం మాఫీ అయిందని, కొత్తగా రుణాలు తీసుకోవడానికి బ్యాంకులకు పరుగెత్తితే అక్కడ చేదు నిజం బయటపడింది.. నీ రుణం మాఫీ అవ్వడం కాదు, తీసుకున్న రుణానికి అసలు, కలిపి మిత్తి తో కలిపి ఐదేళ్లలో రూ.1,20,000 చేరుకుంది. మాఫీ మాత్రం రూ.70 వేలకు మాత్రమే అనుమతి లభించింది.. మిగతా రూ.50 వేలు బ్యాంకుకు చెల్లిస్తేనే, కొత్త రుణం ఇస్తాము.. లేకుంటే, మిమ్మల్ని డిఫాల్టర్లుగా పరిగణించి, ఇంకా ఎప్పుడు కూడా రుణాలు ఇవ్వకుండా చేస్తామని బ్యాంక్ అధికారులు బెదిరిస్తున్నారు.. ఏంటి.? ఇదేంటి, పరిస్థితి అంటూ, రైతులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ పథకాన్ని పూర్తిస్థాయిలో ఏవగించుకుంటున్నారు.. మీరు మాఫీ చేసేది ఏంటి… నేను తీసుకున్న రుణంకే మిత్తిని రూ.50 వేల కట్టాల్సి వస్తుందని సగటు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… ఇక , రుణమాఫీ అనేది నాకెందుకు..? నా జేబులో నుంచే రూ.50 వేలు కట్టించుకుంటే, రైతు పరిస్థితి ఏంటి..? రైతులకు ఇచ్చే “రైతుబంధు” ఏ మూలకు సరిపోతుంది..? అంటూ రైతులంతా ఆవేదన వ్యక్తం చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారింది.. ఒకే దఫాలో గనక రూ.లక్ష రుణమాఫీ చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… వచ్చే ఎన్నికల్లో రైతులంతా మూకుమ్మడిగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు …

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *