నేను ఎన్నికల్లో ఓడిపోతే నష్టపోయేది మీరే..!!

0
10

ఓటమిని ఒప్పుకున్నసీఎం కేసీఆర్
— ఓడిస్తే ఇంట్లో కూర్చుంటా…

— నాకేమైతది ..?

— అచ్చంపేట సభలో కేసీఆర్ నైరాశ్యం

కే .అశోక్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
ఫోన్ :9603322489

ఏ ఆర్ మీడియా , ఏసియన్ మీడియా, హైదరాబాద్ ;

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార హోరు, ప్రజల మౌత్ పబ్లిసిటీ చివరకు సీఎం కేసీఆర్ చెవిన పడినట్లుంది.. అందుకే ,ఎంతో ఆవేదన చెంది, సర్వేల మీద సర్వేలు చేపిస్తూ ప్రజల నాడిని పసిగట్టేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు… కానీ, ఈసారి మార్పు తప్పదనే సామాన్యుడి నోటి మాట, సీఎం చెవికి సోకింది.. దీంతో, నేటి అచ్చంపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారిగా ఓటమిని అంగీకరించే మాటలు చెప్పటం సంచలనంగా మారింది… ఇప్పటికే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా ఓటమి అంశాన్ని ప్రస్తావించడం ప్రజలను కూడా ప్రభావితం చేసినట్లు అయింది.. ఇప్పటివరకు సామాన్య ప్రజలు నోటి మాట ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పుకుంటున్న నేపథ్యంలో , సీఎం కేసీఆర్ ఓటమి మాటలు మరింతగా ప్రజల్లోకి వెళ్లి ఆ పార్టీకి ప్రతిబంధకంగా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది..

అచ్చంపేటలో సీఎం కేసీఆర్ మాట సంచలనం:

అచ్చంపేట బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఓడిపోతే ఏమైతది..? ఇంట్లో కూర్చుంటాం… మాకేమన్నా నష్టమా..? అంటూ ఒకరకంగా ప్రజలను సైతం బెదిరించే స్థాయికి వెళ్లారని భావన ఏర్పడింది .. సీఎం కేసీఆర్ ఇలాంటి మాటలు చెప్పటం మరింత అవమానకరంగా ఉన్నాయనే భావన ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళింది… సీఎం కేసీఆర్ మాటల పై ప్రజలే కాదు, టిఆర్ఎస్ పార్టీ నేతలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనప్పటికీ, సీఎం కేసీఆర్ ఓడిపోతామనే మాట చెప్పకుండా ఉండాల్సిందని అంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here