కెసిఆర్ ను బదనాం చేయడానికి లిక్కర్ కేస్ లో నన్ను ఇరికించారు ….కావాలంటే నన్ను జైల్లో వేసుకోండి …అనవసరమైన విమర్శలు చేయకండి.. :MLC Kavitha

కెసిఆర్ ను బదనాం చేయడానికి లిక్కర్ కేస్ లో నన్ను ఇరికించారు ….కావాలంటే నన్ను  జైల్లో వేసుకోండి …అనవసరమైన విమర్శలు చేయకండి.. :MLC Kavitha

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‌కు మేలు చేసేందుకు ఏపీలో బీఆర్ఎస్ విస్తరించినట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలొస్తున్నాయి. కాపుల ఓట్లను చీల్చి టీడీపీకి నష్టం చేసేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారనే ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా జోరుగా జరుగుతోంది. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

‘కాపు ఓటు బేస్, ఇంకోకటి కాకుండా ఏపీ ప్రజల ప్రయోజనాలు ఎలా కాపాడాలి.. ఆ ఎజెండా సాకారం అవ్వాలంటే ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే వ్యూహం ఉంటుంది. కులాల వారీగా లేదా మతాలు, వర్గాల వారీగా అనేది సీఎం కేసీఆర్ ఆయా రాష్ట్రాలను బట్టి వ్యూహాన్ని నిర్ణయిస్తారు. పొలిటికల్ పార్టీలకు మేలు చేయడానికి బీఆర్ఎస్ పెట్టలేదు. ప్రజలకు మేలు చేయడానికి పెట్టాము. ప్రజలకు ఏది ముఖ్యం, ప్రజల కోసం టేకప్ చేయాల్సిన ఇష్యూ ఏంటి? అనేది ప్రధానంగా ఉంటుంది తప్ప ఏ పార్టీకి సహాయం చేయడానికి కాదు’ అని కవిత తెలిపారు.

 1000 కోట్ల ప్యాకేజ్ పై

టీడీపీతో జనసేనపొత్తుపెట్టుకోనివ్వకుండా చేసేందుకు పవన్ కల్యాణ్‌కు కేసీఆర్ రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందించారు. ఆ విషయం గురించి తనకు తెలియదని, తాను వినలేదని చెప్పారు. ఏపీలోనే కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌ను విస్తరిస్తున్నట్లు చెప్పారు. తమకు యూపీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో.. ఏపీ మీద కూడా అంతే ఉంటుందని, దేశంలో మార్పు కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేశామన్నారు.

వచ్చే  టర్మ్   లో కూడా కెసిఆరే… ముఖ్యమంత్రి కేటీఆర్ కాదు..!

అలాగే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే కేటీఆర్ సీఎం అంటూ వస్తున్న వార్తలపై కవిత ఓపెన్ అయ్యారు. వచ్చే ‘ఎన్నికల్లో కూడా కేసీఆర్‌నే మా సీఎం అభ్యర్థి. ప్రజలు ఆశీర్వదిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తాం. తెలంగాణలో పనిచేస్తూనే దేశవ్యాప్తంగా బీజేపీ వైఫల్యాలను ఎండగడుతాం. ఏ పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా నేను పార్టీ కోసం పనిచేస్తా. పార్టీకి ఎంత చేతనైతే అంత పనిచేస్తా. పార్టీ గుర్తించినప్పుడు పదవి ఇస్తారు. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ డిసైడ్ చేయాలి’ అని కవిత పేర్కొన్నారు.

తాను కేసీఆర్ బిడ్డనని, భయం అనేదే తెలియదన్నారు. లిక్కర్ స్కాం అనేది బూటకమని, తాను జైలుకు భయపడనన్నారు. తన ఫోన్లు భద్రంగా ఉన్నాయని, కావాలంటే దర్యాప్తు సంస్థలకు ఇస్తానని కవిత చెప్పారు. తప్పు చేసినప్పుడు భయపడాలని, తాను తప్పు చేయనప్పుడు భయమెందుకని వ్యాఖ్యానించారు.

administrator
WWW.AMNINDIA.COM

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *