
T.R.S. MLC KAVITHA.WARNED B.J.P. M.P. ARAVIND..
నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. గురువారం ధర్మ పురి అరవింద్ నిజామాబాద్ లో మీడియా తో మాట్లాడారు, ఈ సందర్భంగా కవిత తెలంగాణ రాష్ట్ర సమితిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ,ఆమె కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇదే అంశం ప్రస్తుతం టి.ఆర్. ఎస్, బి.జె.పి పార్టీ ల మధ్య తీవ్ర దుమారం లేపుతుంది.దీని పై తీవ్రంగా స్పందించిన కవిత నిజామాబాద్ మెయిన్ సెంటర్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్‌ను చెప్పుల తో కొడతామని హెచ్చరించారు. అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తాను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే తో మాట్లాడానని సత్య దూరమని ఆమె అన్నారు. శుక్రవారం అసెంబ్లీలోని లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు
.
ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి అరవింద్ చాలా దారుణంగా మాట్లాడుతున్నారని కనీసం ఆయన వయసుకు కూడ గౌరవం ఇవ్వకుండా , అన్ పార్లమెంటరీయన్ మాటలు మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. భవిష్యత్ లో అరవింద్ ఇలానే మాట్లాడితే తమ కార్య కర్తలు సహించరని కవిత హెచ్చరించారు.