TT Ads

’చీటర్లకు బిజెపిలో స్థానం లేదు : బండి సంజయ్

…..జర్నలిస్టులను మోసం చేసిన చీటర్ను కట్టేసి కొట్టండి

…భారత్ టుడే ఉద్యోగులకు బండి సంజయ్ సంఘీభావం

హైదరాబాద్:
గత ఆరు నెలలుగా భారత్ టుడే టీవీ ఛానల్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్న ధరం గురువారెడ్డి అనే చీటర్ తో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు . పార్టీ పేరు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడే చీటర్లకు పార్టీలో ఎలాంటి స్థానము ఉండదని, గురువారెడ్డి అనే వ్యక్తి తో బీజేపీకి సంబంధం లేదని పేర్కొన్నారు. శనివారం భారత్ టుడే టీవీ ఛానల్ ఉద్యోగులు బండి సంజయ్ ని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి ధరం గురువారెడ్డి అరాచకాలపై గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పార్టీ పేరు చెబుతూ ప్రజలను వంచించే వారితో మాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చీటర్లకు స్థానం లేకుండా బిజెపి క్రమశిక్షణ కలిగిన పార్టీగా పనిచేస్తుందని అన్నారు. మీడియా సంస్థలో పనిచేసే జర్నలిస్టుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురువారెడ్డిని “చెట్టుకు కట్టేసి కొట్టండి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పేరు చెప్తే తనకు ఫోన్ చేసి చెప్పాలని, అంతా తాను చూసుకుంటానని ఉద్యోగస్తులకు బండి సంజయ్ భరోసా ఇచ్చారు.

బిజెపి ముసుగుతో మీడియాలోకి…

బిజెపి ముసుగుతో మీడియా ఛానల్లో ప్రవేశించి పార్టీని బదునామ్ చేసే వారు ఎవరైనా సహించేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు. జర్నలిస్టులను జీతాలు ఇవ్వకుండా వేధించే దుర్మార్గులను కఠినంగా శిక్షించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు . ఇలాంటి చీటర్లను పార్టీ ఆఫీసులో అడుగు పెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. భారత్ టుడే ఛానల్ ఒక పేరు ప్రతిష్టలు గల ఛానల్ గా విరాజిల్లిందని ,అలాంటి ఛానల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులను ఫేక్ కేసులతో వేధింపులకు గురి చేయటం , అనేక రకాలుగా కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడటం వంటి ఘటనలు క్షమించరానివాని ఆయన అన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర అమోఘమని అలాంటి వారి పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్న గురువారెడ్డి తీరుతెన్నులపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఎల్లప్పుడు బిజెపి మీడియా ప్రతినిధులను గౌరవిస్తుందని, అలాంటి వారి శ్రేయస్సు కోసం నిరంతరం పార్టీ పనిచేస్తుందన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *