Rajinikanth’s 72nd birthday: First look from upcoming film ‘Jailer’ రజినీకాంత్ రమ్యకృష్ణ జంటగా నిర్మితమవుతున్న జైలర్ సినిమా పోస్టర్ విడుదల

Rajinikanth’s 72nd birthday: First look from upcoming film ‘Jailer’  రజినీకాంత్ రమ్యకృష్ణ జంటగా నిర్మితమవుతున్న జైలర్ సినిమా పోస్టర్ విడుదల

Head Line. Rajinikanth’s 72nd birthday: First look from upcoming film 'Jailer' to be released today Sun Pictures officially announced the film under the title Thalaivar 169 in February this year and shared the first poster of the film in June this year

రజనీకాంత్ కథానాయకుడిగా ‘జైలర్’ రూపొందుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘జైలర్’ టైటిల్ పోస్టర్ ను వదిలిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి.

ఈ రోజున రజనీ బర్త్ డే కావడంతో, ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి రజనీ స్పెషల్ పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆయన పాత్ర అయిన ‘ముత్తు వేల్ పాండియన్’ ను ఈ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. రజనీ మార్క్ స్టయిల్ ఈ పోస్టర్ లో కనిపిస్తూనే ఉంది.

ఇది ఒక జైలు చుట్టూ తిరిగే కథ అనీ .. ‘జైలర్’ చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. చాలాకాలం తరువాత రజనీ .. రమ్యకృష్ణ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

administrator
WWW.AMNINDIA.COM

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *