
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది.23.40 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియను శుక్రవారం 12.10 గంటలకు ప్రారంభించగా, కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే సరిగ్గా ఉదయం 11.50 గంటలకు రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది.సూర్యుడిపై ప్రయోగానికి ఇస్రోకి ఇదే తొలి మిషన్ సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన మొదటి మిషన్ ఆదిత్య L1నే కావడం విశేషం.