తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దే విజయం…75 సీట్లు సాధించటం ఖాయం… మాజీ ఎంపీ జోస్యం..!

0
7

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దే అధికారం

రాజస్థాన్ ,ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్  జెండా నే ఎగుడుతుంది

ఆంధ్రప్రదేశ్ లో  గణనీయంగా కాంగ్రెస్ పుంజుకుంది..

మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతా మోహన్..

తెలంగాణలో జరగబోయే ఎన్నికలపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు నా రాజకీయ అనుభవం తో, సర్వే చేస్తోన్న వివిధ సంస్థ ల తో మాట్లాడి చెపుతున్నని చింతా చెప్పారు .. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ  లో కాంగ్రెస్ పార్టీ 75 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని చింత మోహన్ ధీమాను వ్యక్తం చేశారు. ఇక రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని ఆయన చెప్పారు మధ్యప్రదేశ్లో ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి 130 నుండి 150 సీట్లు వస్తాయని ఆయన చెప్పారు అటు చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ పార్టీ బిజెపి కుట్రలు ఎదుర్కొని అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ముఖ్యంగా దళితులు ముస్లింలు క్రిస్టియన్లు బలహీన వర్గాలు అన్ని ఆశగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు  ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రస్తుతం  10 నుంచి 15 శాతం ఓటు బ్యాంకు కాంగ్రెస్ కి పెరిగిందన్నారు. రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు తమ పార్టీతో కలసిన వారు తప్పకుండా అధికారంలోకి వస్తారన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ 2005లో రాజ్యంగ సవరణ ద్వారా చట్టం చేసి 27శాతం రిజర్వేషన్లను ఇచ్చిందని.. 75 సంవత్సరాల్లో ఓబీసీలు రాజకీయంగా ముందుకు వెళ్లలేదని.. బీసీలకు రాజకీయాల్లో సంచితస్థానం ఉండాలంటే దేశవ్యాప్తంగా కుల గణన చేస్తేనే ఓబీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లను లభిస్తాయని చింతా మోహన్ చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here