TT Ads

 

Watch The Video

హైదరాబాదులో మహిళలపై వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి .తాను ఇష్టపడిన వ్యక్తి వేరొక వ్యక్తి పెళ్లి చేసుకుంటుందని తెలిసి గుండాలతో వచ్చి మహిళను కిడ్నాప్ చేసిన ఉదంతం రంగా రెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తాను ఇష్ట పడిన యువతి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకొంటుందని తెలిసి న యువకుడు యువతి ఇంటి పై దాడి చేసి విధ్వంసం సృష్టించాడు.ఇంట్లోకి చొరబడిన గుండాలు సినిమా సన్నివేశాలను తలిపిస్తూ నానా హంగామా సృష్టించారు. వస్తువులన్నిటినీ ధ్వంసం చేశారు. తల్లిదండ్రులను బంధువులను చుట్టుపక్కల ప్రజలను ఇష్టం వచ్చినట్లు కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు

 

. యువతిని బలవంతంగా లాక్కొని కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. హైదరాబాదులో టీ టైమ్స్ వ్యాపారం చేస్తున్న నవీన్ రెడ్డి అనే వ్యక్తి నగర శివార్లలోని తుర్కయంజాల్ లో నివాసముంటున్న ఒక యువతి పై మనసు పడ్డాడు. ప్రేమిస్తున్నాను తనను పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా వెంటపడుతున్నాడు .కానీ ఆ యువతి అతని ప్రేమను తిరస్కరిస్తూ వచ్చింది.  నల్లగొండ జిల్లా ముషం పల్లి గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమ పేరిట తనను వేధిస్తున్నట్లు ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో యువతి  ఫిర్యాదు చేసింది.

పోలీసులు కౌన్సిలింగ్ చేసి వదిలేశారు అయినా అతనిలో మార్పు రాకపోగా ఆ యువతిపై మరింత ఇష్టాన్ని పెంచుకున్నాడు శుక్రవారం యువతీకి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు ..విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి తను ఇష్టపడిన మహిళ మరొక్కరిని పెళ్లి చేసుకుంటుందని తెలిసి కొంత  మంది గుండాలతో యువతి నివాసం ఉంటున్న ఇంటికి వచ్చి విధ్వంసం సృష్టించాడు.

అందర్నీ భయభ్రాంతులను గురిచేసి మహిళను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలను రంగంలోకి దింపారు నిందితుడు ఎక్కడున్నా పట్టుకుంటామని ఇబ్రహీంపట్నం ఏసిపి ఉమామహేశ్వరరావు తెలిపారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *