
Breaking News
డిహైడ్రేట్ కావడతో షూటింగ్ లో కళ్ళు తిరిగి పడ్డ హీరో నాగశౌర్య..
AIG హాస్పిటల్ లో చికిత్స
ఆందోళన పడవలసిన అవసరం లేదు..
డీహైడ్రేషన్ వల్లే కళ్ళు తిరిగి పడ్డారు…
TUESEDAY డిశ్చార్జ్ చేస్తాం… *AIG వైద్యులు*
. యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్ లో ఉండగా ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో, వెంటనే ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు
టాలివుడ్ రంగం లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న నాగ శౌర్య తన బాడీ స్లిమ్ విష్యం లో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.యువతలో మరింత క్రేజ్ సంపాందించేందుకు సిక్స్ ప్యాక్ మెంటైన్ చేస్తున్నాడు.డైట్ లో భాగంగా మిత మైన ఆహారం తీసుకున్నట్లు చెబుతున్నారు . సోమవారం హైదరాబాద్ పరిసర ప్రాంతం లో షూటింగ్ లో కళ్ళు తిరిగి పడిపోయారు వెంటనే గచ్చ్చి బౌలి లో ని A.I.G Hospital తరలించారు
సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఆయన డైట్ ప్యాక్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు. నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు