తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో సైలెన్స్… కాంగ్రెస్ పార్టీ లో జోష.!!

0
4

తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. చేరికలతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొంటే. బీజేపీలో జోరు తగ్గింది. ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా! అనే డౌట్ వ‌స్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ 115 మందితో అభ్యర్థుల ప‌స్ట్ లిస్ట్ ప్రకటించి యుద్ధనికి సైర‌న్ మోగించింది. కానీ, మొన్నటి వరకు బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకున్నది బీజేపీ. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి దిగిపోయాక ఆ పార్టీలో జోష్ తగ్గింది. అసలేందుకు ఈ పరిస్థితి వ‌చ్చిందో అంతు చిక్క‌టం లేద‌ని టాక్ వినిపిస్తోంది.

బిజెపిలోకి ఆగిపోయిన వలసలు

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ తప్ప పెద్ద నాయకులు ఎవరూ బీజేపీలో చేరలేదు. మరోవైపు కాంగ్రెస్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతురావు వంటి లీడర్లు చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది. 6 గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో కు జనాల్లో మంచి స్పందన వస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ కు తేది సమీపిస్తున్న కదలిక లేని బీజేపీ

డిసెంబర్ ఫస్ట్ వీక్ లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ ఫస్ట్ వీక్ తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ టైంలో ఊపు మీదున్న బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆ పదవి నుంచి తొలగించారు. బీజేపీ కి మంచి జరుగుతుందనే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఐతే.. బండి సంజయ్ తెచ్చిన ఊపును కొత్తగా వచ్చిన కిషన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారా..? అంటే లేదనే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నిరుద్యోగ దీక్ష తప్ప.. జనాల్లోకి వెళ్లేలా పెద్ద ప్రోగ్రాంలు ఏమీ లేవు. మ‌రోవైపు కేసీఆర్ కుటుంబం స్టైల్ లోనే కౌంటర్లు ఇవ్వడంతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు బండి సంజ‌య్‌. కిషన్ రెడ్డికి అలాంటి ఊపు మీద ఉండే మాట‌లు రావు. హుందాగా మాట్లాడుతారు. అది మాస్ జనాలకు అంతగా ఎక్కట్లేదు. కిషన్ రెడ్డికి ఇదో పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు.

రోజురోజుకు వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరిగిపోతుంటే… రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ మాత్రం అంతకంతకూ పడిపోతోంది. రాష్ట్ర బీజేపీ నేతల్లోనూ సఖ్యత కొరవడిందని సమాచారం. బీఆర్‌ఎస్‌లో టికెట్‌ దక్కని కీలక నేతలంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. మరికొందరు కూడా హస్తంతో చెయ్యి కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచే కాదు.. బీజేపీలోని కీలక నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. అంటే… తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్‌లో చేరబోతున్నారా.? ప్ర‌స్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే.. అవుననే అనిపిస్తోంది.

ఈటెల పెద్దరికం.. ,కవిత అరెస్టు వ్యవహారం… గ్రాఫ్ తగ్గిన బిజెపి

ఈటల రాజేందర్‌కు జాతీయ నాయకత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నప్పటి నుంచి బీజేపీలోని ఓ వర్గం రగిలిపోతోంది. ఈటల చెప్పడం వల్లే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నది వారి ఆరోపణ. వారిని సంప్రదించకుండా… కొందరిని బీజేపీలో చేర్చుకోవడం కూడా వారి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. వారంతా బీజేపీ జాతీయ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. లిక్కర్‌ స్కామ్‌లో కవితను అరెస్ట్‌ చేయకపోవడం.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టకపోవడం కూడా బీఆర్‌ఎస్‌కు ప్లస్‌గా మారుతుందని బీజేపీ అసంతృప్తులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు,

కమలం పెద్దలతో తేల్చుకునేందుకు సిద్ధమైన అసంతృప్త నేతలు

బీజేపీలోని అసంతృప్త నేతలంతా తరచూ రహస్య సమావేశాలు నిర్వహించడం.. హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల రెండు, మూడు సార్లు సమావేశమైన నేతలు.. నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో మీటింగ్‌ పెట్టకున్నారు. ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావుతోపాటు పలువురు నేతలు హాజ‌రయ్యారు. త్వరలోనే వీరంతా ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో పాటు పార్టీ పెద్దలను కలిసి తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని భావిస్తున్నారట. జాతీయ నాయకత్వం అనుకూలంగా స్పందించకపోతే పార్టీ వీడేందుకు కూడా సిద్ధమే అన్న సంకేతాలను పార్టీ పెద్దలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ టచ్ లోకి బిజెపి నేతలు

బీజేపీ అసంతృప్త నేతలంతా ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానంతో చర్చించిన తర్వాత… వారి రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూసుకుని… అవసరమైతే కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యేందుకు కూడా గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే.. బీజేపీలోని కీలక నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని.. రాబోయే కాలంలో కాంగ్రెస్‌లోకి చేరికలు పెరుగుతాయని టీపీసీసీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి 50వేలు పెట్టి నమోదు చేసుకోమంటే ఎగబడి మరీ 1000 మంది అప్లై చేశారు. దీనిని బట్టే చెప్పోచ్చు అక్కడ ఎంత పోటీ ఉందో.. బీజేపీ మాత్రం ఫ్రీగా అప్లై చేసుకోమని చెప్పినప్పటికీ.. 50కిపైగా స్థానాల్లో బలమైన అభ్యర్థులు కానరావడం లేదని తెలుస్తోంది. మ‌రోవైపు బీజేపీలో ఇమడలేని కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here