TT Ads

77 స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సై ఇచ్చిన తేనేటి విందు వెల వెల బోయింది. ముఖ్యమంత్రి తో పాటు బి.ఆర్.ఎస్ నాయకులు వరుసగా మూడు సంవత్సరాలు గా హాజరు కాకపోయినప్పటికి బి.జె.పి.,కాంగ్రెస్ నాయకులు హాజరవుతు వస్తున్నారు. కానీ ఈ సారి ఎందుకో ఆ రెండు పార్టీల నాయకులు హాజరు కాకపోవడం పట్ల గవర్నర్ కొంత అసహనికి గురయ్యారు.ఆరంగంట లొనే వచ్చిన అతిధుల ను గ్రౌండ్ లో పలకరించి రాజ్ భవన్ కు వెళ్లిపోయారు.

తెలంగాణ రాజ్‌భవన్‌లో పంద్రాగస్టును పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు
అయితే గంటన్నరపాటు సాగిన ఈ తేనీటి విందు కార్యక్రమం రాజకీయ నేతల హడావిడి లేక వెలవెలబోయింది. షరామామూలుగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరంగా ఉన్నారు.

వరుసగా మూడోసారి రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదు. బీఆర్‌ఎస్‌ అధినేత మాత్రమే కాదు అధికార ప్రజాప్రతినిధులు(మంత్రులు, ఎమ్మెల్యేలు) సైతం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలు సైతం ఎట్‌హోమ్‌లో కనిపించకపోవడం గమనార్హం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. తెలంగాణ బీజేపీ తరపున కీలక నేతలు సైతం ఎట్‌ హోమ్‌కు దూరంగా ఉండడం. తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్ ఆరాధేతో పాటు కొంత మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *