TT Ads

అమ్మాయిలు  ప్రేమలో పడ్డారని ఈజీ గా తెలుసుకోవొచ్చు అంటున్నారు మానసిక నిపుణులు.ప్రేమలో పడ్డ తర్వాత అద్దం ముందు ఎక్కువగా కూర్చుంటారని, కొత్త లోకంలోకి వెళ్లిపోతారని కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటారని తరచు వింటుంటాం. కానీ కొంతమంది నిపుణులు తెలిపిన దాని ప్రకారం ప్రేమలో పడ్డ అమ్మాయి, అబ్బాయిల్లో కొన్ని రసాయనిక మార్పులు జరిగి శరీరంలో నిర్దిష్ట ఆకర్షణ వస్తుందట. మెదడులోని యుపోరిక్ రసాయనాలు విడుదలై బంధాన్ని ఏర్పరచడానికి సహాయం చేస్తాయట. లవ్ లో పడ్డవారు చాలా బలంగా తయారవుతారట.

ప్రేమ కలిగినప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలై నొప్పిని తట్టుకునే శక్తిని కూడా ఇస్తుందట. అంతేకాకుండా వీరు ఉత్సాహంగా ఉంటారట. అలాగే అరచేతుల్లో చెమటలు పడుతూ, బుగ్గలుఎర్రగాతయారవుతాయని అంటున్నారు. అంతేకాకుండా ఆడపిల్లల్లో ఫేస్ లో అనేక మార్పులు రావడం, హృదయ స్పందన రేటు పెరుగుతుందట. అలాగే రొమ్ము భాగాలు విస్తరించడం, అంతేకాకుండా ప్రేమికుల యొక్క కళ్ళు కూడా పెద్దగా అవుతాయట. ఇవన్నీ నాడీ వ్యవస్థ పరిణామాల వల్లే కలుగుతాయని అంటున్నారు. ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రేమలో పడ్డ వ్యక్తులకు ఆకలి కాకపోవడం, దీనికి ప్రధాన కారణం కడుపులోని రక్తనాళాలు కుషించుకుపోయి కార్టీసాల్ విడుదల చేస్తుందట.

దీనివల్ల వారిలో ఆకలి సరిగ్గా ఉండదని అంటున్నారు. అలాగే వీరికి భాగస్వామితో సమయం గడిపితే ఆ టైంలో ఎక్కువగా ఆకలి పుడుతుందట. అలాగే ప్రేమలో పడితే మెదడులో ఆడ్రినలిన్, డొపమైన్, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు విడుదలవడం వల్ల ఇద్దరి మధ్య గురుత్వాకర్షణ శక్తి బాండింగ్ పెరిగిపోతుందట. అలాగే ప్రేమలో పడ్డ అమ్మాయిలు అంతకుముందులా ఇంట్లో ఉండకుండా కాస్త భయంగా, డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారట. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా మీ అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడ్డట్టే అని మీరు గమనించుకోవాలి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *