అక్టోబర్ 11వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..!!

0
13

అక్టోబరు 13 లోపు ఎన్నికల షెడ్యూలు?*

3   వ తేదీనుండి  తెలంగాణ రాష్ట్రంలో ఈసీ అధికారుల సమావేశాలు

ఒకేసారి  ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబరు 13వతేదీ లోపు షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలున్నాయని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి. మొత్తం కమిషన్‌ సభ్యులు తెలంగాణలో పర్యటించి వచ్చిన తరువాత ఏ రోజైనా ఎన్నికల షెడ్యూలు ప్రకటించవచ్చని ఈసీ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబరు 3 నుంచి 6వ తేదీ వరకు ఎన్నికల కమిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యులు, ఇతర అధికారులు.. తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తారు. చివరిగా ఢిల్లీలో పూర్తి స్థాయి సమావేశం నిర్వహించి, తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు చేస్తారు. 2018లో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును ఆ ఏడాది అక్టోబరు 7 వ తేదీన షెడ్యూల్ ప్రకటించిఇది. అయితే ఈ సారి తెలంగాణ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల కు ఎన్నిక జరుగుతున్నాయి .. ఈసారి కూడా కొంచెం అటు ఇటు గా విధుల చేసే అవకాశం ఉంది. అక్టోబరు 11 వ  తేదీనుండి 13 వ తేదీ లోపు  లోపు ఎన్నికల తేదీలను ఖరారు చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికలు నవంబర్ చివరి వారం లో కానీ డిసెంబర్ మొదటి వారం లో గాని జరిగే అవకాశం ఉంది.

:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here