TT Ads

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్‌లో ఉంది మరియు రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.4గా నమోదైంది. రాత్రి 7.57 గంటలకు భూప్రకంపనలు సంభవించివించింది

దేశ రాజధాని ప్రాంతంలో భూకంపాలు రావడం వారంలో ఇది రెండోసారి. గత బుధవారం కూడా ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

కాగా, హిమాలయ పర్వతాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. తగు చర్యలు తీసుకుంటే ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించవచ్చని అంటున్నారు.

ఇటీవలి కాలంలో భారత భూ ఫలకంపై యురేషియా భూఫలకం ఒత్తిడి నిలకడగా కొనసాగుతోందని, ఈ సందర్భంగా ఉత్పన్నమయ్యే శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *