ఏపీకి వెళ్లాల్సిందే: సోమేశ్‌ కుమార్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశం

ఏపీకి వెళ్లాల్సిందే: సోమేశ్‌ కుమార్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశం

Head Line...తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. అలాగే సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) సొంత రాష్ట్రమైన ఏపీకి వెళ్లాలని హైకోర్టు సూచించింది.

తెలంగాణ సీఎస్ సోమేశ్‌ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశించింది హైకోర్టు. తెలంగాణ‌కు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును ర‌ద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. చీఫ్ సెక్ర‌ట‌రీగా తెలంగాణ‌లో సోమేశ్ కుమార్ కొన‌సాగింపును ర‌ద్దు చేస్తూ హైకోర్టు సీజే జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ బెంచ్ తీర్పు వెల్ల‌డించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాల‌ని కోర్టు ఆదేశించింది.
రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో సోమేశ్ కుమార్‌ను కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేటాయించింది. దీంతో సోమేశ్ కుమార్ క్యాట్‌(కేంద్ర ప‌రిపాల‌న ట్రిబ్యున‌ల్‌)ను ఆశ్ర‌యించారు. ఈ క్ర‌మంలో కేంద్రం ఉత్త‌ర్వులు నిలిపివేసి తెలంగాణ‌లో కొన‌సాగేలా క్యాట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.
క్యాట్ మ‌ధ్యంత‌ర ఉత్వ‌ర్వుల‌తో సోమేశ్ కుమార్ తెలంగాణ‌లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో క్యాట్ ఉత్త‌ర్వులు కొట్టేయాల‌ని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్ర‌యించింది. క్యాట్ మ‌ధ్యంత‌ర‌ ఉత్త‌ర్వుల‌ను కొట్టివేస్తూ హైకోర్టు సీజే ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం తీర్పు వెల్ల‌డించింది. సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేసింది కోర్టు. 2019, డిసెంబ‌ర్ నుంచి తెలంగాణ సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొన‌సాగుతున్నారు.

administrator
WWW.AMNINDIA.COM

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *