TT Ads

వివిధ రకాల కేసుల్లో నిందితులు శిక్షింపబడేందుకు అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి అన్నారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన దర్యాప్తుల ద్వారా నిందితులు శిక్షింపబడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి సోమవారం నాడు రాష్ట్రంలోని వివిధ పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిందితులు శిక్షింపబడటం ద్వారా నేరాలు నియంత్రణలోకి వస్తాయన్నారు. ఫిర్యాదులను పరిమితికి మించి పెండింగ్ లో ఉంచకూడదని చెప్పారు. క్లిష్టమైన ఫిర్యాదులను వారం రోజుల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా అన్ని వర్గాల ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం మరింత పెంపొందుతుందని తెలిపారు. సమర్థవంతంగా పనిచేసే అన్ని స్థాయిలకు చెందిన అధికారులకు ప్రతినెల రివార్డులను అందజేస్తామని చెప్పారు. రోడ్లపై వదిలి వెళ్ళిన, డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి తీసుకెళ్లని వాహనాలను కరీంనగర్ కమిషనరేట్ లో 5 సార్లు బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు దేహదారుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వ్యాయామం, యోగా, ధ్యానం లను దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలని చెప్పారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సవాళ్లు ఎదురైన మానసికంగా, శారీరకంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

*కరీంనగర్ కమిషనరేట్ కు మరోసారి అభినందన*

కరీంనగర్ కమిషనరేట్ పోలీసులను రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి మరోసారి అభినందించారు. నిందితులకు శిక్షలు విధించబడటంలో కరీంనగర్ కమిషనరేట్ రాష్ట్రంలో 5వ స్థానంలో కొనసాగుతున్నదని వెల్లడించారు. వివిధ పని విభాగాలు (వర్టికల్స్) లో కరీంనగర్ రాష్ట్రంలో ముందంజలో కొనసాగుతున్న విషయం విదితమే.

పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఏ చిన్న సందేహం వచ్చిన వెంటనే నివృత్తి చేసుకోవడం ద్వారా ఈ గుర్తింపు లభించడం గర్వకారణంగా ఉందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డిసిపి (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్ ఏసిపి లు విజయసారధి, కరుణాకర్ రావు, మదన్ లాల్, కాశయ్య, సత్యనారాయణ, వెంకటరెడ్డి, విజయ్ కుమార్, ప్రతాప్, ఎస్బిఐ సంతోష్ కుమార్ లతో పాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *