26.7 C
Hyderabad
Tuesday, May 28, 2024

ప్రపంచ వికలాంగుల దినోత్సవ ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 50 వేల రూపాయల నిధులు విడుదల.. మంత్రి కొప్పుల ఈశ్వర్..

Must read

** దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండ
** డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం
** పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకంలోనూ ఎస్సీ వర్గాల వికలాంగులకు ప్రాధాన్యత కల్పిస్తామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని మహిళా,శిశు వికలాంగుల
సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ప్రపంచ అధికారంలో దినోత్సవం పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.
దేశంలోనే దివ్యంగుల పట్ల ఏ రాష్ట్రం చూపించని ఆధారణను తెలంగాణ ప్రభుత్వం కనబరుస్తుందని అన్నారు. వికలాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు మంచి కోణంలో.. సదుద్దేశంతో చూడాలని అన్నారు. ప్రభుత్వానికి మంచి సూచనలు చేయాలే తప్ప విమర్శలు చేయడం సరి కాదని అన్నారు. ప్రజలు కోరుకొని పథకాలను సైతం అమలు చేస్తున్నారని.. అయినా కొందరు తప్పు విమర్శలు చేస్తున్నారని.. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో తమ సమస్యలు చెప్పుకొని పరిష్కరించుకోవచ్చని సూచించారు. వికలాంగులు ప్రతిపాదించిన అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్తానని హామీ ఇచ్చారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవ ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 50 వేల రూపాయల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వికలాంగుల దినోత్సవం వేడుకలో అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వికారాబాద్ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించాలని వికలాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ సమావేశంలో దివ్యాంగుల శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్, డైరెక్టర్ శైలజ సహా పలువురు వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article