TT Ads

గద్వాల ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు ఉత్తర్వులను పాటించి తక్షణమే.. డీకే అరుణను ఎమ్మెల్యేగా నోటిఫై చేస్తూ గెజిట్ ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. హై కోర్ట్ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి, అసెంబ్లీ కార్యదర్శి కి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ లేఖతో పాటు హైకోర్టు ఉత్తర్వులను జత చేసింది. డీకే అరుణ 2018 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెపై బిఆర్ఎస్ పార్టీకి చెందిన రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు. అయితే రామ్మోహన్ రెడ్డి అఫిడవిట్లో వాస్తవాలను పేర్కొనలేదని డీకే అరుణ హైకోర్టు ను ఆశ్రయించింది. దీనిపై విచారించిన హైకోర్టు రామ్మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. వెంటనే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది .దీనికి అనుగుణంగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గజిట్ విడుదల చేయాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేసి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *