Covid cases…. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది… రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి…. కేంద్రం హెచ్చరిక

Covid cases….   ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది… రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి…. కేంద్రం హెచ్చరిక

Head Line...ప్రజాగ్రహంతో ఇటీవలే కరోనా ఆంక్షలను సడలించింది చైనా. దీంతో రోజువారి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో ఆ దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజలు కోవిడ్‌ బారినపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

చైనాలో 60 శాతం మంది  కోవిడ్ బారిన పడే  అవకాశం 

జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్‌ లో  పెరుగుతున్న కేసులు

: చైనా సహా పలు దేశాల్లో కోవిడ్‌ కేసులు భారీగా నమోదవుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. విదేశాల్లో కరోనా కేసుల పెరుగుదలపై భారత్‌ అప్రమత్తమైంది. కోవిడ్‌ కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని, పాజిటివ్‌ కేసుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని సూచించింది. ఇన్సాకాగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా కొత్త కేసులను ట్రాక్‌ చేయాలని సూచిస్తూ రాష్ట్రాలకు. కేంద్ర ఆరోగ్య శాఖ   లేఖ రాసింది

‘జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్‌, చైనాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లను ఇన్సకాగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ట్రాక్‌ చేసేందుకు పాజిటివ్‌ కేసుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలి. అలా చేయడం ద్వారా సరైన సమయంలో కొత్త వేరియంట్లను గుర్తించగలుగుతాం. దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతామ’ని  ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌. తెలిపారు

 చైనాలో కోవిడ్ అంశాలపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇటీవలే కరోనా ఆంక్షలను సడలించింది . దీంతో అక్కడ రోజువారి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో ఆ దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజలు కోవిడ్‌ బారినపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో  మంగళవారం 112 కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 3,490 ఇండియాలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచంలో పెరిగిపోతున్న  కేసు లను దృష్రిలో పెట్టుకుని. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది

administrator
WWW.AMNINDIA.COM

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *