
ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ను భారీగా తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పది, 20 రూపాయలు కాకుండా ఏకంగా 200 రూపాయల వరకు ధర తగ్గనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జాతీయ పత్రికలు అన్నీ కథనాలు ప్రచురిస్తున్నాయి. ఆగస్ట్ 29వ తేదీ ఢిల్లీలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర 11 వందల రూపాయల వరకు ఉంది. మోదీ ప్రధానమంత్రి కాక ముందే ఈ గ్యాస్ సిలిండర్ ధర 450 రూపాయలుగా ఉంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో మూడింతలు పెరిగింది. దీనికితోడు నిత్యావసర సరుకుల ధరలు సైతం భారీగా పెరిగాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా దేశంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ ధరను 200 రూపాయలు తగ్గించాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.