కారు ఎక్కేందుకు రెడి అవుతున్న కాంగీయులు… లిస్ట్ లో ఉత్తమ్ బట్టి.జగ్గా రెడ్డి, దామోదర్, తో పాటు పలువురు సీనియర్లు
Head Line...Uttam Kumar Reddy stated that 54 of the 108 positions announced went to TDP members. Jagga Reddy questioned how they could be called coverts Mr. Rajanarsimha added, criticising Mr. Revanth Reddy. Mr. Yaskhi characterised the fight as ‘Real Congressmen Vs Outsiders’.
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ని వదిలి పెట్టి ఇతర పార్టీలలోచేరడానికిదారులువెతుక్కుంటున్నారు.2019 తర్వాత ఆ పార్టీ దేశ వ్యాప్తంగా బలహీన పడడం తో చాలా మంది సీనియర్లు పార్టీ ని విడిచిపెట్టి వెళ్లి పోయారు.వారంతా రాహుల్ గాంధీ వైఫల్యాలను ఎత్తి పొడుస్తూ ఆయన వల్లనే పార్టీ విడిచి వెళ్తున్నామని విమర్శల వర్షం గుప్పించారు. బాగా అధికారానికి అలవాటు పడ్డ నాయకులు తమ స్వార్థం కోసం పార్టీ విడిచి వెళ్తున్నారనేది జగమెరిగిన సత్యం.ఇతర పార్టీ ల లో చేరడానికి ఎదో ఒక స్టోరీ కావాలి కనుక వారంతా రాహుల్ గాంధీ నే టార్గెట్ గా పెట్టుకున్నారు.సరిగ్గా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ని విడిచి పెట్టి తమకు అనుకూలంగా వుండే భారతీయ రాష్ట్ర సమితిలో లేదా భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఉత్తరాది లో పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేసినట్లే ఇక్కడ పి.సి.సి.అధ్యక్షుడు రెవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు.ఇటు రాష్టం లో కానీ అటు కేంద్రం లో కానీ కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో అధికారం లోకి వచ్చేందుకు అవకాశం కనిపించక పోవడం తో కొంతమంది నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు పై ఆందోళనతో ఉన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టు కోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ని విడిచి పెట్టేందుకు సందర్భం సమయం కోసం ఎదురుచూస్తున్నారు
సోషల్ మీడియాలో తమను పథకం ప్రకారం రేవంత్ రెడ్డి దెబ్బ కొడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వ్యూహ కర్త సునీల్ ఆఫీస్ పై. దాడులు పోలీసులతో జరిగిన సందర్భంలో ఆ విషయం బయటపడిందని వారు అంటున్నారు. దానికి కావాల్సిన సమాచారం అంతా తమ వద్ద ఉందని వారు అంటున్నారు. హైదరాబాద్ నగర సిపి ఆనంద్ తమకు అందజేశారని ఓ సీనియర్ నాయకుడు చెప్తున్నారు .
సునీల్ కనుగోలు పార్టీ కోసమే పనిచేస్తున్నారు. పార్టీలోని వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. ఉత్తమ్‌పై కూడా సునీల్ వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు… సీవీ ఆనంద్ మీకు ఎలా చెప్పారు ? మేముఎలా నమ్మాలి ? మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని అన్నప్పుడు మీరెక్కడ వున్నారు ? బీజేపీకి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు ? మునుగోడులో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా ? దానికి సంబందించిన ఆధారాలు ఉన్నాయి సీనియర్లను సూటిగా ప్రశ్నించారు .కాంగ్రెస్ పార్టీ కి చెందిన గూడూరు నారాయణ్ రెడ్డి ని బి.జె.పి లో చేర్పించింది ఉత్తమ్ కాదా అని వారు అంటున్నారు.
కొంత మంది నాయకులు చాలా కాలంగా ముఖ్య మంత్రి కే.సి.ఆర్ కు కోవర్ట్ లు గా ఉంటున్నారనే విమర్శలు,ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విమర్శలకు బలం చేకూర్చే విదంగా భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి,. జగ్గారెడ్డి, ,దామోదరం రాజనరసింహ్మ తో పాటు పలువురు సీనియర్ నాయకులు శని వారం భట్టి ఇంట్లో సమావేశం నిర్వహించారు. ఇటీవల AICC ప్రకటించిిిన కార్య వర్గం లో అంతా తెలుగు దేశం పార్టీ కి చెందిన వారే ఉన్నారని విమర్శలు లేవనెత్తారు.ఇక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు.అయితే ఈ సమావేశం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకరిద్దరే కాకుండా పెద్ద ఎత్తున నాయకులను కార్య కర్తలను పార్టీ మారేలా వారు పావులను కదుపుతున్నారని భావిస్తున్నారు.పార్టీ కి అండగా ఉంటూ వస్తున్న దళిత,రెడ్డి వర్గాలను తమ వైపు తిప్పుకునెందుకు వ్యూహరచన చేస్తున్నారు.
2018 అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ను చూపిస్తూ తెలంగాణ వాదాన్ని ఉపయోగించుకొని ఏ విదంగా అధికారం లోకి వచ్చాడో అదే ఫార్ములాను కాంగ్రెస్ సీనియర్ లు ఎంచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ,తెలుగు దేశం పార్టీ మాజీ నాయకుల పేరిట కాంగ్రెస్ పార్టీ ని ఖాళీ చేయాలని వ్యూహంలో ఉన్నట్లు కనిపోస్తోంది. పార్టీ లో అసమర్థ పి సి.సి.నాయకుడిగా ముద్ర పడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడటం చాలా వింతగా విచిత్రంగా
ఉందని ఆ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే చేతులు ముడుచుకుని కూర్చున్న ఉత్తంకుమార్ రెడ్డి పార్టీ పరిస్థితిపై మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు మనో ధైర్యాన్ని అందించి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి వుందని వారు అంటున్నారు. వీరంతా రేపో మాపో బి.ఆర్.ఎస్ పార్టీ లో మరి కొంతమంది భారతీయ జనతా పార్టీ లో చేరే అవకాశం లేక పోలేదని రాజా కీయ పరిశీలకులు భావిస్తున్నారు.