టైగర్ వస్తుందన్నారు…ఫాక్స్ వచ్చింది.. ఉచ్చులో పడిపోయింది..!!.

0
9

కాంగ్రెస్ ట్రాప్ లో కెసిఆర్

— ఆరు గ్యారెంటీ స్కీం లను కాపీ కొట్టిన కేసీఆర్

— హుస్నాబాద్ సభలో చప్పగా సాగిన కెసిఆర్ ప్రసంగం

— ఆకట్టుకోలేని హావభావాలు

–- ఓటమిచోటనే ప్రచార అరంగేట్రం
— ఈసారి కలిసి రాని హుస్నాబాద్ సెంటిమెంట్

కొండం అశోక్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
ఫోన్ నెంబర్ 9603322489

ఏ ఆర్ మీడియా, ఏసియన్ మీడియా హైదరాబాద్:

మొత్తం మీద సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ట్రాప్ లో పడిపోయారు… కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలని ఆరు గ్యారెంటీ స్కీమ్లతో కూడిన హామీలను ఇచ్చింది… వీటన్నిటిని ఎలా అమలు చేస్తారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదేవా చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు.. ఇప్పుడేమో వాటిని తలదన్నే విధంగా కొంత ఎక్కువ లబ్ధిని చేకూరుస్తూ వారి స్కీములను కాపీ కొట్టారు… అలాగే గత కొంతకాలంగా తెలంగాణ ప్రజలకు ముఖం చాటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాజు వెడలే రభణభ సభకు అన్నట్లుగా పెద్ద హంగామా చేస్తూ, డబ్బులు ఇచ్చి జనాలను తరలించి “ఆహా – ఓహో “అన్నట్లుగా నిర్వహించాలనుకున్న తీరు బెడిసి కొట్టింది.. ప్రధానంగా హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ కు గతంలో మాదిరి కలిసి వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి.. ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గట్టి పునాదులు వేసుకొని ఉంది… అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్థానికంగా పెద్దగా ప్రజలను ప్రభావితం చేసే విధంగా పనిచేయకపోవడం వల్ల పూడ్చలేని నష్టం వాటిలనుంది.. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బిఆర్ఎస్ వ్యతిరేక వాణి వినిపిస్తోంది.. అయితే, దీనిని అంతగా పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు దిద్దుబాటు చర్యలు చేపట్టకుండానే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..

హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలో వాడి వేడి తగ్గింది.. గతంలో మాదిరిగా ప్రజలను ఆకట్టుకునే విధంగా లేకుండా చెప్పగా సాగింది.. పైగా, పాడిందే పాటగా, చెప్పిందే చెప్పి, స్థానిక ప్రజలను మరో మారు మభ్యపెట్టే విధంగా ఉన్నాయి… తప్ప, వాస్తవానికి ఏ ఒక్కటి కూడా నమ్మశక్యంగా లేవని ప్రజలు పెదవి విరుస్తున్నారు… ప్రధానంగా గౌరవెల్లి ప్రాజెక్టును ప్రస్తావించిన సీఎం కేసీఆర్, ఇప్పటివరకు దానిని పూర్తిస్థాయిలో నిర్మించి స్థానిక రైతులకు సాగునీరు అందించలేదు… పైగా, ఈ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల భూ నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వకుండా, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేసిన విషయాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని గొప్పగా చెప్పుకున్న సీఎం కేసీఆర్ ,హుస్నాబాద్ నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో ఇంటింటికి పరిశుద్ధమైన మంచినీరు వస్తుందా.? ఆ నీరు ఎలా ఉంది.? తాగడానికి అనుకూలంగా ఉందా.. లేదా .?అనే విషయాన్ని పట్టించుకోకుండా గొప్పలకు పోవడం పై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. పక్కనున్న సిద్దిపేట నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది..? హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎలా ఉంది..? ఇక్కడి ప్రజలకు కనీస సౌకర్యాలైన కూడు, గుడ్డ , నీరు, గూడు సరిగా అందుతున్నాయా..? అనే అంశాలను పట్టించుకోకుండా బి ఆర్ ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల నియోజకవర్గంలో రోజురోజుకు తన ప్రభావాన్ని కోల్పోతోంది.. ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు బిఆర్ఎస్ నేతలు అనుసరిస్తున్న విధానాలపై ఏవగించుకుంటున్నారు.

గెలిచే చోటా పెడితే బాగుండేది:

ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సెంటిమెంట్ గా భావించి మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని అత్యుత్సాహంతో బహిరంగ సభ నిర్వహించి పప్పులో కాలేశారు.. 2018 లోనే కాంగ్రెస్ పార్టీకి హుస్నాబాద్ నియోజకవర్గంలో 100 శాతం గెలిచే అవకాశాలు ఉండేవి.. కానీ, అప్పటి పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని కమ్యూనిస్టులకు వదిలివేయడం వల్ల, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా చెల్లా చెదిరిపోయారు… ఇప్పుడు కమ్యూనిస్టుల పొత్తుతోపాటు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అందిస్తున్న మద్దతుతో ఈ నియోజకవర్గంలో గెలుపు నల్లేరుపై నడకే అన్నట్లుగా ఉంది… గ్రౌండ్ రిపోర్టు ఇలా ఉంటే, బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం అట్టహాసంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చేత పెద్ద బహిరంగ సభను నిర్వహించి జబ్బలు చరుచుకుంటున్నారు.. అయితే , సీఎం కేసీఆర్ మొదటి ప్రచార అరంగేట్రం మాత్రం పూర్తిగా విఫలం కానున్నది.. హుస్నాబాద్ లో పెట్టిన ఫోకస్ గెలిచే స్థానాలైన సిద్దిపేట, సిరిసిల్ల లలో పెడితే బాగుండేదని పరిశీలకులు భావిస్తున్నారు..

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద అగాథంలో పడిపోయారు. ఆరు గ్యారంటీలు ఇస్తామంటే బీఆరెస్ నేతలు అదెలా సాధ్యమన్నారు …కానీ, ఇప్పుడు బీఆరెస్ నేతలు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత కోల్పోయారు.

కాపీ కొట్టిన మేనిఫెస్టో:

“మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ రూ.2,500 అంటే కేసీఆర్ ఇవాళ రూ.3 వేలు అన్నారు… ఆడబిడ్డలకు రూ.500 గ్యాస్ సిలిండర్ అంటే సీఎం కెసిఆర్ రూ.400 అన్నారు…
ఇక పెన్షన్ల విషయంలో రూ.4 వేలు అంటే, రూ.5 వేలు అన్నారు… ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ.15 వేలు ఇస్తామంటే… సీఎం మాత్రం ఇప్పుడు రూ.16 వేలు ఇస్తామంటున్నారు.ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ మరో మారు ప్రజలను మభ్య పెట్టే విధంగా మేనిఫెస్టో ప్రకటించడం ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయింది..

బీఆర్ఎస్ మేనిఫెస్టో పాత హామీలనే అమలు చేయకుండా.. ఇప్పుడు మరో సారి మోసం చేద్దామని ముందుకొచ్చినట్లు గా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలలో రూ.4 వేల పెన్షన్, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే… అదెలా సాధ్యమవుతుంది? అంటూ ఇన్నాళ్లు మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వారి మేనిఫెస్టో పట్ల ఏం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

55 సీట్లలో 40 నుంచి 45 స్థానాల్లో గెలుపు :

తాజాగా కాంగ్రెస్ పార్టీ 55 నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థుల వివరాలను బట్టి చూస్తే వీటిలో దాదాపు 40 నుంచి 45 నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపు బాటలో ఉన్నారు.. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా కసరత్తు చేసి విడుదల చేసిన మొదటి విడత జాబితాలో రేసుగుర్రాలు అధికంగానే ఉన్నారు.. 40 నుంచి 45 సీట్లు సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయి .. మిగతా 10 సీట్లలో పోటీ తీవ్రతరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.


వీటిలో కూడా టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రెండవ జాబితాలో కూడా గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చే విధంగా అధిష్టానం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.. కులాల ప్రాతిపదికన చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పెద్దపీట వేస్తుంది..

*మూడు విడతలుగా బస్సు యాత్ర*

రాష్ట్రంలో మూడు విడతలుగా విజయభేరీ బస్సుయాత్ర ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర, దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని పేర్కొంది.
ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత బస్సు యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారు.18న రామప్ప దేవాలయంలో శివుడికి పూజ చేసి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. అదే రోజు భూపాలపల్లి లో మహిళలతో సమావేశం, 19న రామగుండంలో సింగరేణి కార్మికులతో సమావేశం, పెద్దపల్లిలో పాదయాత్ర, సభ, కరీంనగర్ లో పాదయాత్ర , సభ.
20 న జగిత్యాల, బోధన్, నిజామాబాద్ లో పాదయాత్ర, సభలు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here