ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోడీ భజన చేస్తూ A..P.అభివృద్ధి ని గాలికి వదిలేస్తున్నారు…

0
6

A.P.Congress News..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిరాశపరించందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ప్రధానమంత్రి విశాఖ పర్యటన సందర్భంగా ఎన్నో హామీలు తమకు లభిస్తాయని ప్రజలు భావించారని కానీ అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టి వెళ్లిపోయాడని ఏపీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తులసి రెడ్డి అన్నారు

Tulasi Reddy , Congress Leader

.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం వంటి అనేక ప్రాజెక్టులపై మాట్లాడుతాడు అని అనుకున్నామని కానీ అవి ఏమీ లేకుండా నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరూ మోడీ భజన తో కాలం గడుపుతున్నారని  తులసి రెడ్డి  ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తేనే అన్ని విషయాల్లో అభివృద్ధి సాధిస్తుందని తులసి రెడ్డి చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here