26.7 C
Hyderabad
Tuesday, May 28, 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CMO లో 8 మంది ఆఫీసర్లకు కేటాయించిన శాఖలివే..!

Must read

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన నెలరోజుల తర్వాత తమ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు వేదశాఖ కేటాయించారు సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రికి సీఎంగా బాధ్యతలు మొత్తం అప్పగించారు

శేషాద్రి (ఐఏఎస్) – ప్రిన్సిపల్ సెక్రటరీ (సీఎంఓ)

సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, హోం శాఖ, ఫైనాన్స్, ప్లానింగ్ డిపార్టుమెంటు, లా డిపార్టుమెంటు, లెజిస్లేటివ్ వింగ్, లాండ్ రెవెన్యూ, సీఎంఓ ఓవరాల్ ఇన్‌చార్జి. మొత్తంగా సీఎంఓను సమన్వయం చేస్తారు. సీఎంఓలోని మిగిలిన అధికారులంతా కీలకమైన పాలసీ అంశాలను శేషాద్రితో చర్చిస్తారు.

మాణిక్‌రాజ్, (ఐఏఎస్), సెక్రటరీ (సీఎంఓ)

విద్యుత్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్ (స్కూల్, హయ్యర్, టెక్నికల్), రెవెన్యూ (కమర్షియల్ టాక్స్, ఎక్సయిజ్), మైన్స్

చంద్రశేఖర్‌రెడ్డి (ఐఎఫ్ఎస్), సెక్రటరీ (సీఎంఓ)

ఫారెస్టు, సైన్స్-టెక్నాలజీ, వ్యవసాయం, పశుసంవర్ధకం, డెయిరీ డెవలప్‌మెంట్, సహకారం, మార్కెటింగ్, పౌర సరఫరాలు, రవాణా, రోడ్లు-భవనాలు, హౌజింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, త్రాగునీటి సరఫరా

షా నవాజ్ ఖాసిం (ఐపీఎస్), సెక్రటరీ (సీఎంఓ)

బీసీ, మైనారిటీల సంక్షేమం, విపత్తు నిర్వహణ, స్పోర్ట్స్, యువజన సర్వీసులు, సీఎం సెక్యూరిటీ

అజిత్‌రెడ్డి (ఐడీఈఎస్) – స్పెషల్ సెక్రటీ (సీఎంఓ)

పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఇన్వెస్ట్ మెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్స్, లేబర్, సమాచార పౌర సంబంధాలు, సీఎం అపాయింట్‌మెంట్లు, సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి)

సంగీతా సత్యనారాయణ (ఐఏఎస్) – జాయింట్ సెక్రటరీ (సీఎంఓ)

వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం, మహిళా శిశు అభివృద్ధి-సంక్షేమం, ఎస్సీ డెవలప్‌మెంట్, గిరిజన సంక్షేమం, సీఎంఓ అడ్మినిస్ట్రేషన్

వేముల శ్రీనివాస్, ఓఎస్డీ (సీఎంఓ)

దేవాదాయ, సంస్కృతి, పర్యాటకం, సీఎంకు వచ్చే పిటిషన్లు, ప్రజావాణి, సీఎంఆర్ఎఫ్ అసిస్టెన్స్, సీఎంఓ కంప్యూటరీకరణ

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article