జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయకండి …అది క్యాన్సర్ కావొచ్చు.!

0
8

చాలా కాలంగా జ్వరంగా ఉంటుందా..? ఆ జ్వరం 100 వరకే ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే బ్లడ్ కేన్సర్ (లుకేమియా)లోనూ ఇలా పైరిక్సియా (జ్వరం/శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి మించడం) కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

పైరెక్సియా అన్నది కేన్సర్ విస్తరిస్తుందనడానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. మన శరీర రోగ నిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్, ఫారీన్ బాడీలపై పోరాడే సమయంలో కనిపించేదే పైరిక్సియా.

సాధారణంగా అన్నిరకాల కేన్సర్లోనూ పైరిక్సియా కనిపించొచ్చు. కాకపోతే ఎక్కువగా బ్లడ్ కేన్సర్ లో ఇది తెలుస్తుంది. బ్రెస్ట్ కేన్సర్, లంగ్ కేన్సర్, బవెల్ కేన్సర్లలో జ్వరం కనిపించడం తక్కువే. కాకపోతే ఈ కేన్సర్ బాధితుల్లో ట్యూమర్ కాలేయానికి వ్యాపిస్తే కనుక జ్వరం వస్తుందని బ్రిటన్ పరిశోధన చెబుతోంది.                 

జ్వరం ఎందుకని?       

కేన్సర్లలో జ్వరం ఎందుకు వస్తుంది? అన్నది స్పష్టంగా తెలియదు. పైరోజెన్స్ అనే పదార్థాలు కేన్సర్ లో ఫీవర్ కు కారణమన్నది రాస్ వెల్ పార్క్ కాంప్రహెన్సివ్ కేన్సర్ సెంటర్ చెబుతోంది. కేన్సర్ ట్యూమర్ పైరోజెన్స్ ను విడుదల చేస్తుంది.

లక్షణాలు..

సాధారణంగా అప్పుడప్పుడు జ్వరం వచ్చిన భావన మనకు అనిపిస్తుంటుంది. అలా ఒక పూటో, ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లిపోతుంది. కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయి జ్వరంగానూ తిరగబెడుతుంది. జ్వరం వచ్చిందంటే లోపల ఇమ్యూనిటీ యాక్టివేట్ అయినట్టు భావించొచ్చు. రోగ నిరోధక వ్యవస్థ ఎందుకు చురుగ్గా మారిందన్నది గుర్తించడం ఎంతో అవసరం. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ ఉన్నా కానీ, దానిపై పోరాడే విషయంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు ఈ జ్వరానికి శరీరం స్పందించి చెమట విడుదల చేస్తుంది. కేన్సర్ బాధితుల్లో రాత్రి వేళల్లో వేడి ఆవిర్లు, చెమటలు పోయడం ఇందులో భాగమే.

వైద్యులను కలవాల్సిందే..

చాలా రోజులుగా జ్వరం ఉంటోందని గుర్తిస్తే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి సమస్య ఏంటో తెలియజేయాలి. అది కేన్సర్ కాకపోయినా నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవడం వల్ల నష్టం జరగకుండా నివారించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో టీబీ వ్యాధి ఉన్నా కానీ, జ్వరం వీడకుండా వేధిస్తుంటుంది. కాలేయ సమస్యల్లోనూ జ్వరం కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here