గాంధీ భవన్ లో బి.ఆర్.ఎస్.కారు ..!!

0
4

తెలంగాణ  అసెంబబ్లీ ఎన్నికలకు  సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాత వరణం వేడెక్కతోంది.బి.ఆర్.ఎస్.కాంగ్రెస్ ,భారతీయ జనతా పార్టీ లు  పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.ఒకరి లోపాలను మరొకరు ఎట్టి చూపుతు విమర్శలు చేసుకుంటున్నారు.ఇక సోషల్ మీడియాలో అంతకంటే జోరుగా  ప్రకటనలు గుప్పించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ అందుకు భిన్నంగా మరో అడుగు ముందుకు వేసింది. ఏకంగా బి.ఆర్.ఎస్. పార్టీ ఎన్నికల గుర్తు కారు లోపలికి   వచ్చింది. గాంధీ భవన్ లో కారు గుర్తు ఏంటా అని  ఆశ్చర్యంగా చూశారు

 

కాంగ్రెస్ లో టికెట్ దొరకని వ్యక్తులు నిరసనగా బి ఆర్ ఎస్  కారును ఎవరైనా లోపలికి తీసుకొచ్చారా అణికున్నారు.కానీ దగ్గిరకి  వెళ్లి చూస్తే అసలు మ్యాటర్ వేరే ఉంది.కె.సి.ఆర్ ప్రభుత్వ  వైఫల్యాలను ఎండగడుతూ అంబాసిడర్ కారు మీద గులాబీ రంగు స్టిక్కరులు అతికించారు.నిరుద్యోగుల ను మోసం చేసిన కె.సి.ఆర్,అలుడు వస్తే ఏడ పండుకుంటడు  అందుకే డబుల్ బెడ్ రూమ్ అంటివి ఎటుపాయే బెడ్ రూమ్ లు అంటూ స్టిక్కరులు వేశారు.

సో  మొత్తం మీద గాంధీ భవన్ లో బి.ఆర్.ఎస్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి బి.ఆర్.ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో హస్తం గుర్తు ఏ విధంగా ఎంటర్ అవుతుందో చూద్దాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here