TT Ads

బీఆర్ఎస్ గెలిచేది 15 మంది మాత్రమే

గెలుపు బాటలో ముగ్గురు మంత్రులు …10 మంది ఎమ్మెల్యేలు

ఆర్భాటంగా 115 అభ్యర్థుల ప్రకటనతో తలకిందులు

ఎన్నికల నాటికి కష్టపడితే మరో 10 సీట్లు

ఆనాటి ఎన్టీఆర్ గాంబీరత్వమే మళ్లీ పునరావృతం

పాత ముఖాలతో విసుగెత్తిన తెలంగాణ ప్రజలు

భూ దందాలు… సెటిల్మెంట్లు .. అవినీతి వల్లే ఓటమి

క్షేత్రస్థాయిలో పనిచేయని కేసీఆర్ చరిస్మా

(కొండం అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ )

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైనమార్పులు కోరుకుంటున్నారు… గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ తీరు తెన్నులు, ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల పనితీరుపై పూర్తిస్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవల తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థుల గెలుపుపై పెదవి విరుస్తున్నారు… ప్రధానంగా ఎమ్మెల్యేలు ఈ 10 సంవత్సరాలలో క్షేత్రస్థాయిలో ప్రజలను ఏ విధంగా చూసుకున్నారనే అంశంపై రెండు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో చేసిన సర్వే ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టుగా మారాయి..

ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా తెలంగాణ వాది అనే పేరును సార్ధకం చేసుకున్నారని, ప్రజలు ఆయన వైపు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేలపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది.. ముఖ్యమంత్రి కెసిఆర్ చరిష్మా కింది స్థాయిలో పెద్దగా కనిపించడం లేదు… అలాగే, మంత్రులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను ఏనాడు పట్టించుకోకపోవడం వల్ల వారి పై కూడా అసంతృప్తి వ్యక్తం అయింది.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 16 మంత్రులకు గాను కేవలం 3మంది మంత్రులు గెలిచే అవకాశం ఉండగా, మరో 12 మంది ఎమ్మెల్యేలు గెలుపు బాటలో ఉన్నారు.. ఇంకా కాంగ్రెస్ బిజెపి పార్టీని అభ్యర్థులను ప్రకటించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ చెమటోడిస్తే మరో 10 స్థానాల్లో మెరుగుపడి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి… ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 115 అభ్యర్థులలో కేవలం 15 మంది మాత్రమే గెలుపు బాటలో ఉన్నట్లు ఇప్పటివరకు స్పష్టమైంది..

గెలిచే మంత్రులు వీరే:

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతమున్న మంత్రుల్లో కేవలం ముగ్గురు మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి… వీరిలో సిద్దిపేట ఎమ్మెల్యే గా ఉన్న హరీష్ రావు, సిరిసిల్ల అభ్యర్థిగా ఉన్న తారక రామారావు, పాలకుర్తి ఎమ్మెల్యే గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ అధిపతి సునీల్ రెడ్డి పోటీని ఇవ్వనున్నారు… అలాగే, కరీంనగర్ నుంచి వస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కు ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు గట్టి పోటీని ఇవ్వనున్నారు .. వీరిద్దరికీ గెలుపు అంత సులువైనదిగా లేదుఎమ్మెల్యేల మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత.

గెలుపు బాటలో ఎమ్మెల్యేలు:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల తో పాటు కరీంనగర్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది.. అలాగే, వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు తోపాటు వినయ్ భాస్కర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లాలో జీరో నుంచి ఒకటి మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి. కోనేరు కోనప్ప (సిర్పూర్ కాగజ్ నగర్ )మాత్రమే… నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి ,నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కామారెడ్డి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గెలవనున్నారు..

కామారెడ్డి లో కూడా మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే మైనార్టీ అభ్యర్థి షబీర్ ఆ ఓట్లను కనినీయంగా తమ వైపు మళ్ళించుకుంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ గెలుపు కష్టతరంగా మారే అవకాశాలు ఉన్నాయి ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జీరో.. మహబూ మహబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలో జీరో టు వన్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది … మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్. నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గం లో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇక రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి 29 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తామని గొప్ప లు చెప్పినప్పటికీ , ఇందులో ఒక రెండు నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి..

మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఆర్భాటంగా ప్రకటించిన 115 స్థానాల్లో కేవలం 15 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతానికి విజయం సాధించే దిశలో ఉన్నారు..

వీరంతా ప్రజల మనసులను చూరగొనే విధంగా ఎన్నికల నోటిఫికేషన్ నాటికి క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల కొంత సానుకూలత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.. అలాగే ఆయా నియోజకవర్గాలలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మరో 10 స్థానాల్లో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.. అయితే ఆయా పార్టీల నుంచి బరిలో ఉండే అభ్యర్థుల గుణగణాలతోపాటు ప్రజల్లో వారికి ఉన్న బలాన్ని అంచనా వేసి పూర్తిస్థాయి గ్రౌండ్ రిపోర్టు తయారు చేయవచ్చు… అయితే ఇప్పటివరకు బిఆర్ఎస్ అభ్యర్థుల ముఖాలను తెలంగాణ ప్రజలు తీవ్రస్థాయిలో అసహ్యించుకుంటున్నారు..

పైగా, ఈ నేతలంతా వారి అనుచర గణంతో భూదందాలు… సెటిల్మెంట్లు చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకున్నారనే అపవాదు ఉంది… ప్రజల జీవన ప్రమాణస్థితిగతులను పెంచడంలో పూర్తిస్థాయిలో వీరంతా విఫలమయ్యారు… ప్రతీ సామాజిక వర్గంలో వీరిపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది… తెలంగాణ ప్రజల్లో ఏ సెక్టార్ను కదిలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న దురాగతాలు, వారు చేస్తున్న అక్రమాలు, సంపాదించుకున్న కోట్లాది రూపాయల ఆస్తుల వివరాలను చెబుతుండడం గమనార్హం…

మైనార్టీలు టిఆర్ఎస్ వ్యతిరేకం:

రాష్ట్రంలోని మైనారిటీలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం .. ప్రస్తుత మారిన పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని ప్రచారం జోరుగా సాగుతోంది… కింది స్థాయిలో కూడా ప్రజలంతా దీనిపైన చర్చలు చేస్తూ బలంగా నమ్ముతున్నారు.. బిజెపితో బీఆర్ఎస్ అంట కాగటం వల్ల మైనారిటీ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ వైపు వెళ్లడం వల్ల, బీఆర్ఎస్ కు తీరని నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి..

1989 నాటి సీన్ రిపీట్ అవుతుందా ..?

1989లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, తాను, ఎవరిని బరిలోకి దించిన అలవోకగా గెలుస్తారని ధీమాతో అభ్యర్థుల ప్రకటన ఇష్టారించిన చేశారు… తాను” చెప్పు” ను నిలబెట్టినా గెలుస్తుందని, ఆనాడు, నందమూరి తారక రామారావు ఆర్బాటంగా అత్యుత్సాహ గొప్పలతో ప్రకటనలు చేశారు.. దీంతో అప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది

ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో అఖండ మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది.. ప్రస్తుతం ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏక మొత్తంలో ఇంత పెద్ద ఎత్తున 115 మంది ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తూ ఏకపక్షంగా ప్రకటించారు. దీంతో, ఆనాడు ఎన్టీ రామారావు చేసిన తప్పిదాన్ని , ఈనాడు, సీఎం కేసీఆర్ చేశారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది..

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *